జాబ్లో చేరిన వారానికే మృత్యుఒడికి..
అమెరికాలోని న్యూయార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన యువకుడు ఈరమళ్ల సాయితేజ (25) మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన వారం రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు.
- న్యూయార్క్లో రోడ్డు ప్రమాదం
- నల్లగొండ జిల్లా యువకుడి మృతి
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)/మునుగోడు: అమెరికాలోని న్యూయార్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన యువకుడు ఈరమళ్ల సాయితేజ (25) మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఆయన వారం రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. వివరాలు ఇలా.. మునుగోడుకు చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల పెద్ద కుమారుడు సాయితేజ ఉన్నత చదువుల కోసం నాలుగేండ్ల క్రితం అమెరికా వెళ్లాడు.
చదువు పూర్తికావడంతో వారం రోజుల కిందటే ఉద్యోగంలో చేరాడు. ఈ నెల 18న రాత్రి న్యూయార్క్లో హైవేపై ప్రయాణిస్తుండగా సాయితేజ కారుకు జింక అడ్డురావడంతో దాన్ని ఢీకొని కారు నిలిచిపోయింది. వెనుక నుంచి వచ్చిన సరకు రవాణా వ్యాన్ ఆ కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు వెంటనే సాయితేజను సమీపంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

