స్మార్ట్‌గా దోచేస్తున్నారు!
నగరంలో ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ) కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండు నెలలు గడిచినా.. కార్డులు అందడం లేదు. అయితే మధ్యవర్తులను ఆశ్రయించి అదనంగా డబ్బులు చెల్లిస్తే మాత్రం ఒక రోజులోనే కార్డులు చేతికి అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- ఆర్టీఏల్లో ఆర్సీ, లైసెన్స్‌ల కృత్రిమ కొరత
- ఏజెంట్లతో వస్తే రెండు రోజుల్లో కార్డులు
- మిగిలిన వారికి నెలన్నరైనా అందని వైనం
- పెరిగిన ఫిర్యాదులు..కార్డుల పంపిణీపై ఆరా
నగరంలో ఆర్టీఏ కార్యాలయాల్లో స్మార్ట్ కార్డుల కొరత వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ లు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (ఆర్సీ) కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రెండు నెలలు గడిచినా.. కార్డులు అందడం లేదు. అయితే మధ్యవర్తులను ఆశ్రయించి అదనంగా డబ్బులు చెల్లిస్తే మాత్రం ఒక రోజులోనే కార్డులు చేతికి అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ) : మేడ్చల్, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో స్మార్ట్ కార్డుల పంపిణీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపిన వారికి మాత్రం వేగంగా కార్డులు అందుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్యాకేజీల వారీగా రేట్స్ ఫిక్స్ చేసి వాహనదారులను దోచుకుంటున్నారు. ఏజెంట్లను కాదని లైసెన్స్ లేదా ఆర్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వాహనదారులు కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కార్డుల కొరత ఉందని, సరఫరా ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నట్లు బాధితులు పేరొంటున్నారు.
అదనపు డబ్బులు చెల్లిస్తే..
సాధారణ దరఖాస్తుదారులకు అందని స్మార్ట్ కార్డులు.. అదనపు డబ్బులు చెల్లిస్తే ఒక రోజులోనే ఎలా అందుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మధ్యవర్తుల ద్వారా డబ్బులు చేతులు మారుతున్నాయా? కార్డుల కొరత నిజంగానే ఉందా? లేక కొందరు సిబ్బంది సహకారంతో ప్రత్యేక వ్యవస్థ నడుస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై రవాణా శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి, కార్డుల కొరతకు కారణాలను వెల్లడించడంతో పాటు మధ్యవర్తుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని వాహనదారులు కోరుతున్నారు. సాధారనంగా ఒక్కో ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు సుమారు 100 నుంచి 150 వరకు కార్డులు పంపిణి జరగాలి.
ఇందుకు సంబందించిన ఫీజ్ ను రవాణా శాఖ.. వాహనదారుల నుంచి ముందే వసూలు చేస్తారు. కానీ కార్డులను మాత్రం నిర్ణీత సమయంలో అందించడం లేదు. కాగా, ఈ వ్యవహారంపై ఆర్టీ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కార్యాలయాల వారీగా ఒకో ఆర్టీఏ ఆఫీస్‌కి స్మార్ట్ కార్డు ఎంత పంపిణీ జరిగింది..? ఎంత అవసరం ఉంది? ఒక రోజుకి ఎన్ని కార్డులు ముద్రిస్తున్నారు? వాహనదారులు దరఖాస్తు చేసుకున్న రోజుల్లోనే కార్డుల జారీ అయిందా తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల బండ్లగూడలో స్మార్ట్ కార్డులను ముందుగా వచ్చిన వారికి కాకుండా ఏజెంట్లతో వచ్చిన వారికి అందించడం ద్వారా సంబంధిత అధికారులపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు స్పందించి స్మార్ట్ కార్డులు నిర్ణీత సమయంలోగా పంపిణీ జరగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

