హెరిటేజ్ ఫుడ్స్‌లో డ్రమ్ పేలి మహిళ మృతి
ఐడీఏ ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ఫ్యాక్టరీలోని డ్రమ్ ఒకసారిగా పేలడంతో కార్మికురాలు పింకీదేవి(35) అకడికకడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..
రామంతాపూర్, నవంబర్ 21: ఐడీఏ ఉప్పల్‌లోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ఫ్యాక్టరీలోని డ్రమ్ ఒకసారిగా పేలడంతో కార్మికురాలు పింకీదేవి(35) అకడికకడే మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన దంపతులు హరేంద్రషా, పింకీదేవి రామంతాపూర్‌లోని గాంధీనగర్‌లో నివాసముంటున్నారు. వీరికి రీసు, ప్రిన్స్, క్రియాంశ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పింకీదేవి హెరిటేజ్ ఫుడ్స్‌లో పనిచేస్తున్నది. క్రేట్ వాషర్ వద్ద వ్యర్థాలు పారబోసేందుకు మొదటి అంతస్తులోని డ్రమ్ వద్దకు వెళ్లింది.
ఆ సమయంలో ఒకసారిగా డ్రమ్ పేలడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్థానికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆందోళనకారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

