కరకరలాడే కుర్కురే శనగలు.. ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం పిల్లలు!
పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే సాయంత్రం కాని తీరిక సమయాల్లో కాని కరకరలాడేలా ఏదో ఒకటి తింటే అదో తృప్తి. ఆ సమయాల్లో నోటి మరలాడించేందుకు కరకరలాడే కుర్కురే శనగలు చాలా బాగుంటాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
బొంబాయి శనగలు: కప్పు
నెయ్యి: టీస్పూను
కారం: అరస్పూను
ఆమ్చూర్: అరస్పూను
ఉప్పు: ఒకటింబావు స్పూను
తయారు చేసే విధానం
శనగల్ని రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారి కుక్కర్లో వేసి ఒక టీస్పూను ఉప్పు వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి కుక్కర్లో ఉడికించాలి. నాలుగైదు విజిల్స్ రానివ్వాలి. శనగలు మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. గింజలు వేటికవి విడివిడిగా ఉండాలి. కుక్కర్ వేడి తగ్గిన తర్వాత వాటిని వడగట్టి తీసి పక్కకు పెట్టుకున్నాక, ఎయిర్ ఫ్రైయర్లో కొద్ది కొద్ది మొత్తాలని ఫ్రై చేయాలి. 160 డిగ్రీల దగ్గర 20 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు అవి బోలుగా కరకరలాడేలా అవుతాయి. అన్ని గింజలూ వేయించడం పూర్తయ్యాక, కడాయి పెట్టుకుని అందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మన ఇష్టాన్ని బట్టి నూనె, వెన్న కూడా వాడుకోవచ్చు. బాణట్లో శనగలు వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి. వాటి మీద ఒక పావు స్పూను ఉప్పు, కొద్దిగా కారం, ఆమ్చూర్ చల్లి కలిపి, చల్లారిన తర్వాత తీసి ఒక గట్టి మూత ఉండే డబ్బాలో పెట్టుకుంటే నచ్చినప్పుడు కరకరలాడే కుర్కురే శనగలు తినొచ్చు. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే శనగల్ని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.
– ఎం.బాలరాయుడు, పాకశాస్త్ర నిపుణురాలు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

