CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
CM Revant vs Farmers | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎక్కడికెళ్లినా అహంకారంతో నోరు జారడం అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆయన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని విమర్శిస్తూ.. పాడిరైతులను కించపర్చే వ్యాఖ్యలు చేశారు. 'సుధీర్‌రెడ్డి బర్రెలను కాసెటోడో ఇంకేమన్ననో నాకైతే తెల్వదుగానీ' అంటూ తన నోటి దురుసును ప్రదర్శించారు.
CM Revant vs Farmers : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎక్కడికెళ్లినా అహంకారంతో నోరు జారడం అలవాటుగా మారిపోయింది. తాజాగా ఆయన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని విమర్శిస్తూ.. పాడిరైతులను కించపర్చే వ్యాఖ్యలు చేశారు. ‘సుధీర్‌రెడ్డి బర్రెలను కాసెటోడో ఇంకేమన్ననో నాకైతే తెల్వదుగానీ’ అంటూ తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘బర్రెలు కాస్తోడు’ అంటూ సీఎం చేసిన అహంకారపు వ్యాఖ్యలపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
బర్రెలు కాసెటోళ్లు, గొర్రెలు కాసెటోళ్లు అంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అని ఓ రైతు ప్రశ్నించారు. తాము బర్రెలను కాసి, పాలు పిండి హైదరాబాద్‌కు పంపితేనే రేవంత్ రెడ్డి తాగుతున్నాడని ఆయన మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాదుగానీ, అందరినీ కించపర్చే వ్యాఖ్యలు చేయడం మాత్రం చేతనైతదని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు ఏమైందంటూ ఎద్దేవా చేశారు.
బర్రెలు కాసేవాళ్లు నీ కంటికి అంత చులకనగా కనబడుతారా..? అని మరో రైతు మండిపడ్డారు. నీ అహంకారం ఇంకా ఎన్నో రోజులు సాగదని, నువ్వు మా దగ్గరికి వచ్చే రోజులు దగ్గరపడ్డాయని రాబోయే ఎన్నికలను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు తాము తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. దాంతో నువ్వు బర్రెలు కాసుకుని బతకాల్సి వస్తదని, నీకు ఆ పరిస్థితిని తాము తప్పకుండా తీసుకొస్తామని వ్యాఖ్యానించారు.
అధికారమదంతో విర్రవీగుతున్న రేవంత్ అహంకారానికి పాడి రైతుల మూతోడ్ జవాబ్!
తమ కష్టాన్నే నమ్ముకుని బతికే బర్లు, గొర్లు కాచుకునే పాడి రైతులంటే…
బ్యాగులు మోసి, దందాలు చేసుకుని బతికే నీకు అంత చులకనెందుకు రేవంత్?రైతన్నలను అష్టకష్టాలకు గురిచేస్తూ,
అడుగడుగునా వారిని అవమానిస్తున్న నిన్ను,
ఆ రైతులే బొందపెట్టడం ఖాయం.— BRS Party (@BRSparty) November 28, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
Sudigali Sudheer | సుడిగాలి సుధీర్‌పై ‘గోట్’ నిర్మాత సంచలన ఆరోపణలు.. చివరి 30 శాతం షూటింగ్‌కు రాలేదంటూ కామెంట్
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

