ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో కర్రసాము
- తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళకు చోటు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళ కర్రసాముకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. వచ్చేనెల 11 నుంచి 22 వరకు మన రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చే ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తొలిసారిగా కర్రసామును ప్రదర్శన క్రీడగా చేర్చారు. కర్రసాములో ప్రధానంగా అలంకారం, యుద్ధం అనే రెండు రకాల ప్రదర్శనలు ఉంటాయి.
అలంకార ప్రదర్శనలో క్రీడాకారుడు కర్రతో వేగంగా, నైపుణ్యంగా వివిధ విన్యాసాలు చేస్తాడు. యుద్ధ ప్రదర్శనలో ఇద్దరు క్రీడాకారులు తలపడతారు. ఇది ప్రదర్శన క్రీడ కాబట్టి పతకాల కోసం పోటీలు ఉండవు. అయితే హకీంపేటలోని తెలంగాణ క్రీడా పాఠశాలలో జరిగే ప్రదర్శనల ద్వారా ఈ రెండు రూపాలను జాతీయ స్థాయికి పరిచయం చేయనున్నారు. ఈ మెగా గేమ్స్‌లో మొత్తం 27 క్రీడాంశాల్లో దాదాపు 6 వేల మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

