ఇంటి దారిని మూసేస్తారా?
- మహిళలను అడ్డుకొని అవమానిస్తారా..
- బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆగ్రహం
- హైడ్రా, ట్రాఫిక్ పోలీసుల తీరుపై సీపీకి ఫిర్యాదు
అంబర్‌పేట, నవంబర్ 27: తమ నివాస గృహాలకు వెళ్లే ఏకైక మార్గాన్ని హైడ్రా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుంటూ తమ కుటుంబసభ్యులను, ముఖ్యంగా మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. శివం రోడ్డులోని 6 నంబర్ చౌరస్తా నుంచి బాగ్‌అంబర్‌పేట వైపు నాలుగు అడుగుల వెడల్పుతో వరదనీటి కాలువ నిర్మాణ పనులను హైడ్రా చేపడుతోందన్నారు. అయితే నిర్మాణ పనుల ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బారికేడ్లు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తమ కాలనీలోని నివాస గృహాలకు వెళ్లే ఏకైక మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హైడ్రా సిబ్బంది, అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. భారీ వాహనాలను రహదారిపై నిలిపి నివాసితుల రాకపోకలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైడ్రా, పోలీసు, కాంట్రాక్టర్ వాహనాలకు మాత్రం అదే మార్గంలో అనుమతిస్తూ, స్థానిక నివాసితుల వాహనాలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నవంబర్ 25న రాత్రి 9 గంటల సమయంలో తన భార్య కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అడ్డుకుని అవమానించారని ఎడ్ల సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు.
కారును నిలిపివేయడంతో ఆమె వాహనం దిగి.. నగలు ధరించి ఉండగానే.. రాత్రివేళ నడుచుకుంటూ.. ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు అవమానకరంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నివాసితుల ప్రాథమిక రాకపోకల హక్కును కాపాడి తమ ఇంటికి వెళ్లే ఏకైక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

