ఇంట్లోనూభద్రత కరువే!
కుటుంబం అంటే భరోసా! జీవిత భాగస్వామి అంటే తోడు.. ఇల్లు అంటే రక్షణ. కానీ, చాలామందిమహిళల జీవితాల్లో ఈఅర్థాలన్నీతలకిందులవుతున్నాయి. నమ్మినవారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు ఐదుగురు మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యులు లేదా జీవితభాగస్వాముల చేతిలో హత్యకు గురవుతున్నారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కుటుంబం అంటే భరోసా! జీవిత భాగస్వామి అంటే తోడు.. ఇల్లు అంటే రక్షణ. కానీ, చాలామందిమహిళల జీవితాల్లో ఈఅర్థాలన్నీతలకిందులవుతున్నాయి. నమ్మినవారి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి గంటకు ఐదుగురు మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యులు లేదా జీవితభాగస్వాముల చేతిలో హత్యకు గురవుతున్నారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించిన నివేదిక మహిళల భద్రతపై మరోసారి చర్చకు తెరతీసింది.
2025లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 47 వేల మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యారు. అంటే రోజుకు సగటున 129 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి గంటకు దాదాపు ఐదుగురు హత్యకు గురవుతున్నారు. మహిళలపై హింసకు సంబంధించిన ఈ గణాంకాలు యూఎన్ ఉమెన్, ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ కార్యాలయం సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడయ్యాయి. బయటివారి నుంచి ఎదురయ్యే ప్రమాదాల కంటే సన్నిహితుల నుంచే మహిళలకు ఎక్కువ ముప్పు పొంచి ఉండటం ఈ నివేదికలోని ప్రధాన ఆందోళనకర అంశం.
ప్రాంతమేదైనా సమస్య ఒక్కటే!
మహిళల హత్యలు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. అయితే ఆఫ్రికాలో ఈ తరహా ఘటనలు అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 22,100 మంది మహిళలు, బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఆసియాలో 15,100 మంది, అమెరికా ఖండంలో 7,400 మంది,
ఐరోపాలో 2,100 మంది, ఓషియానియాలో 300 మంది హత్యకు గురయ్యారు. మహిళలపై హింసకు భౌగోళిక హద్దులు లేవని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మహిళలకు పూర్తి స్థాయిలో భద్రత లేదని గుర్తుచేస్తున్నాయి.
ప్రేమ పేరుతో కట్టడి!
మహిళలపై హింస చాలాసార్లు చిన్నచిన్న ఆంక్షలతోనే మొదలవుతుంది. ఎవరితో మాట్లాడాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? అనే విషయాల్లో భాగస్వామి జోక్యం చేసుకోవడం క్రమంగా నియంత్రణ ధోరణిగా మారుతుంది. అనుమానం, అవమానించడం, బెదిరించడం, మానసికంగా వేధించడం చివరకు శారీరక హింసకు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభించకపోతే సమస్య తీవ్రమవుతుంది.
బయటపడలేక.. చెప్పుకోలేక..
గృహహింసను ఎదుర్కొంటున్న మహిళల్లో చాలామంది తమ సమస్యలను బయటపెట్టడానికి వెనుకాడుతున్నారు. కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్తు, ఆర్థిక ఇబ్బందులు, సమాజం ఏమనుకుంటుందనే భయం వారిని మౌనంగా ఉంచుతున్నాయి. కొందరు ఫిర్యాదు చేసినా తగిన సహాయం అందకపోవడంతో తిరిగి అదే హింసను భరించాల్సి వస్తున్నది. వేధింపులను వ్యక్తిగత కుటుంబ సమస్యగా చూడటం కూడా బాధితులకు న్యాయం అందకుండా చేస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

