అంచనాలు నిజమయ్యాయి!
‘ఈ సినిమా చూసినవారందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. వసూళ్లు కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రానికి అవార్డులు కూడా వస్తాయనే నమ్మకం ఉంది’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు.
‘ఈ సినిమా చూసినవారందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. వసూళ్లు కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రానికి అవార్డులు కూడా వస్తాయనే నమ్మకం ఉంది’ అన్నారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్‌మీట్‌లో ఆయన పాల్గొన్నారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శృతిహాసన్, రుహాని శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకుడు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలు నిర్మించాయి.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఈ సినిమా విషయంలో తమ అంచనాలన్నీ నిజమయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. తమ సంస్థలో తొలి నుంచి ఉత్తమ కథా చిత్రాల్ని అందిస్తున్నామని, ఇది సమాజానికి ఉపయుక్తమయ్యే చిత్రమని స్వప్నదత్ పేర్కొన్నారు. కథలోని సహజత్వం ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తున్నదని గంగరాజు గుణ్ణం తెలిపారు. ఈ సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కిందని కథానాయిక సాత్విక వీరవల్లి ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

