సెమీఫైనల్లో తన్వీ, ఉన్నతి
లక్నో: సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో తన్వీ శర్మ, ఉన్నతి హుడా, పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ సెమీస్ చేరారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ తన్వీ 21-19, 18-21, 21-14తో , ఇండోనేసియాకు చెందిన నీ కడెక్ ధిండా అమర్త్య ప్రతివిపై పోరాడి గెలిచింది. మరో మ్యాచ్‌లో మూడో సీడ్ ఉన్నతి 21-19, 15-21, 21-18తో తోటి షట్లర్ అన్మోల్ ఖర్బ్‌ను ఓడించింది. సెమీస్‌లో తన్వీ, ఉన్నతి పోటీపడనున్నారు.
మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ మార్గోట్ లాంబెర్ట్-కామిల్లె పొగ్నాంటే వాకోవర్ ఇవ్వడంతో గాయత్రి జోడీ నేరుగా సెమీఫైనల్‌కు చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి కనపురం-రేషిక జోడీ 21-8, 21-14తో విరాజ్ కువాలె-రుతపర్ణ పాండా జోడీపై గెలిచి సెమీస్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో తుషార్ సువీర్ క్వార్టర్స్‌లోనే ఓడగా.. డబుల్స్‌లో మూడో సీడ్ హరిహరన్-ఎంఆర్ అర్జున్, సాయి ప్రతీక్-రూబన్ కుమార్ జంటలు కూడా ఇంటిదారి పట్టాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

