డిసెంబర్ 21న అగ్రి వర్సిటీ స్నాతకోత్సవం
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం డిసెంబర్ 21న జరుగనున్నది. రాష్ట్ర గవర్నర్, అగ్రివర్సిటీ చాన్స్‌లర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షతన జరిగే ఈ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరంలో పీహెచ్డీ, పీజీ, యూజీ పూర్తిచేసిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందచేయనున్నట్టు తెలిపారు.
అత్యంత ప్రతిభ కనపర్చిన 17 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నట్టు వివరించారు. స్నాతకోత్సవంలో వైఎస్ఆర్ – కేవీపీ ఫౌండేషన్ తరపున లక్ష రూపాయల నగదు బహుమతి, బంగారు పతకాన్ని విశ్వవిద్యాలయంలో అసాధారణ ప్రతిభ కనబర్చిన విద్యార్థికి తొలిసారి అందజేయనున్నట్టు చెప్పారు. అలాగే ప్రముఖ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐకార్) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్టు వీసీ ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

