భిక్షమెత్తి.. సర్కార్‌కు డబ్బులిస్తా
- ట్రక్ పార్కు, హౌసింగ్ బోర్డు భూముల అమ్మకంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా
- ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కేపీహెచ్‌బీకాలనీ, నవంబర్ 27: ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే భూములను అమ్మొద్దని, కాంగ్రెస్ సర్కార్ డబ్బుల కోసమే ఈ భూములను అమ్మకానికి పెడితే.. ప్రజల దగ్గర భిక్షమెత్తు కొచ్చి ఆ డబ్బులు కడతానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలో ప్రజా ప్రయోజనాలకు కేటాయించిన భూములను సర్కార్ అమ్మకానికి పెట్టడంపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. కూకట్‌పల్లిలో నాడు ట్రక్ పార్కు ఏర్పాటు కోసం 33 ఎకరాల స్థలాన్ని రైతుల నుంచి సేకరించారాని, నేడు ఆదే స్థలాన్ని వ్యాపారులకు అమ్మడం ఎంతవరకు సమంజసమన్నారు.
కూకట్‌పల్లితో పాటు నగరంలో విలువైన స్థలాలను అమ్మకానికి పెట్టి… వాటిని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బినామీలచే కొనుగోలు చేయిస్తున్నారని విమర్శించారు. కూకట్‌పల్లిలో ట్రక్ పార్కు భూములను అమ్మొద్దని కాంగ్రెస్ మినహా… అన్ని రాజకీయ పార్టీలు, చిన్నారులు, మహిళలు, కాలనీల అసోసియేషన్ నేతలు వేడుకున్నా..ప్రభుత్వం మొండిగా అమ్ముతున్నదని, ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా దుర్మార్గంగా స్థలాలను అమ్మకానికి పెట్టిందన్నారు.
కోర్టు తీర్పు రాకముందే హెచ్ఎండీఏ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వేలంపాట నిర్వహించడం సరికాదని, కూకట్పల్లి స్థలాలను కాపాడేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. మరోవైపు కేపీహెచ్‌బీ కాలనీలో హుడా లేఆవుట్ లేకుండానే హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మారని, దీంతో కొనుగోలు చేసిన వారు కోర్టులను ఆశ్రయించాల్సి రావడం బాధాకరమన్నారు. నగరంలో భూముల అమ్మకానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని, దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసి వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

