జీవో 81 పూర్తి అమలే లక్ష్యం: వీఆర్ఏ సంఘం
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ) సమస్యల పరిషారం, ముఖ్యంగా జీవో 81ను పూర్తిస్థాయిలో అమలు చేయించడమే లక్ష్యంగా నూతన రాష్ట్రస్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపూరి రవి చెప్పారు. జీవో 81లో భాగంగా సుమారు 16,500 మంది వీఆర్ఏలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం.. అదే జీవోలోని మరో అంశానికి సంబంధించిన 3,797 మంది విషయంలో ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమని అన్నారు.
వారికీ ఉద్యోగాలు ఇచ్చేంతవరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్లో టీజీఈ-జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్టు తెలిపారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షుడిగా గరికే ఉపేందర్, అధ్యక్షుడిగా దుండి మధు, ప్రధాన కార్యదర్శిగా ఏపూరి రవి, ఉపాధ్యక్షుడిగా చింత శివ, కన్వీనర్‌గా శ్రీశైలం, వరింగ్ ప్రెసిడెంట్‌గా సుల్తాన్ గౌడ్, కోశాధికారిగా చందు ఎన్నికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

