నిషేధిత జాబితాలో.. సర్వే నంబర్లు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిన సర్వే నంబర్లను తొలగించేలా చర్యలు తీసుకోరా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో కొన్ని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చింది.
- తొలగించాలంటూ.. అధికారులకు విన్నపాలు
- రిజిస్ట్రేషన్లు కాక క్రయ విక్రయదారుల అవస్థలు
- అన్ని అనుమతులు ఉండి ఇండ్ల నిర్మాణాలు
- నిషేధిత జాబితాలో చేర్చడంతో ఇబ్బందులు
మేడ్చల్, జూలై 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిన సర్వే నంబర్లను తొలగించేలా చర్యలు తీసుకోరా అని అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లోని వివిధ ప్రాంతాల్లో కొన్ని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చింది. ప్రభుత్వ అనుమతులు ఇచ్చిన లే అవుట్లలోనే ప్లాట్లలోనే సర్కిళ్లలో ఇంటి అనుమతులు పొంది ఇంటి నిర్మాణాలు జరిపిన వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లేవుట్ ప్లాట్లను కొన్ని ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చడంపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు స్థానిక తహసీల్దార్ల కార్యాలయాలకు వెళ్లి అనేకసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. తమ అత్యవసరానికి ప్లాట్లు, ఇండ్లు విక్రయించుకుందామంటే రిజిస్ట్రేషన్లు కావడం లేదని, తమ ఇబ్బందులు తీరకుండా ఉంటున్నాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఎన్వోసీల కోసం కార్యాలయాల చుట్టూ..
తమ అవసరాలకు అత్యవసరంగా ప్లాట్లు, ఇండ్లు అమ్ముకునే వారు ఎన్వోసీల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత సమయంలో రియల్ ఎస్టేట్ డమాల్ కావడంతో తమ అవసరం కోసం తక్కువ ధరకు అమ్ముకుందామునుకున్నా.. నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చడంపై ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. క్రయ, విక్రయదారులు మాత్రం సబ్ రిజిస్టార్ల సూచనలతో తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలను తీసుకెళ్లి ఎన్వోసీలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయాల్లో మొరపెట్టుకుంటున్నారు. తహసీల్దార్లు మాత్రం ఎన్వోసీలను కలెక్టరేట్లో ఇస్తారని చెబుతుండటంతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
యూఎల్సీ, ప్రభుత్వ సర్వే నంబర్లను మాత్రమే నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉండగా, ప్రైవేట్ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారన్నదానిపై ప్రజలకు అనేక అనుమానాలు వస్తున్నాయి. కాగా, ఎన్వోసీలు తీసుకోవాలంటే అన్ని నివేదికలు రావడానికే నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున ఎన్వోసీలు అధికారులు ఎప్పుడు ఇస్తారు. తమ రిజిస్ట్రేషన్లు ఎప్పుడు జరుగుతాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నిషేధిత జాబితాలో చేర్చిన సర్వే నంబర్లను తొలగించాలని అధికారులను కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

