Asian Games : ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పసిడి పతకానికి దూరమవుతున్నారు. మెరుగైన ప్రదర్శన చేస్తున్నా సరే వెండితో లేదా కాంస్యంతోనో సరిపెట్టుకుంటున్నారు. నగోయలో సీనియర్ స్ప్రింటర్ పారుల్ చౌదరీ (Parul Chaudhary) పతక వేట కొనసాగుతోంది. మహిళల 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో కాంస్యం సాధించిన తను.. రోజు వ్యవధిలోనే దేశానికి మరో పతకం అందించింది. సోమవారం మహిళల 5వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్ ఫైనల్లో సత్తా చాటిన పారుల్ మూడో స్థానంలో నిలిచింది.
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరీ మరో పతకం కొల్లగొట్టింది. ఇప్పటికే మహిళల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో కాంస్యంతో మెరిసిన ఈ వెటరన్ ఈసారి 5వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్లోనూ తళుక్కుమంది. సోమవారం జరిగిన ఫైనల్లో మూడో స్థానంతో కాంస్యంను ఒడిసిపట్టింది తను. పసిడి పోరులో ఆమె 15:14.61 సెకన్లలో పరుగు పూర్తి చేసింది. అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కంటే 10 సెకన్లు ఆలస్యంగా పరుగెత్తింది పారుల్. గత ఎడిషన్ ఆసియాడ్‌లో స్వర్ణ పతకం పట్టేసిన పారుల్ ఈసారి కంచుమోతతోనే సరిపెట్టుకుంది. ఈ విభాగంలో కెన్యా అథ్లెట్ విన్‌ఫ్రెడ్ యవి (Winfred Yavi) ప్రథమ స్థానంలో నిలిచి పసిడిని ఎగరేసుకుపోయింది.
BRONZE AGAIN FOR PARUL CHAUDHARY! 🇮🇳🥉
Parul Chaudhary claims her second medal in two days at the #AsianGames2026, winning bronze in the Women’s 5000m with a brilliant time of 15:14.61! She fought right to the line, finishing just 1.46 seconds off silver.
What a phenomenal…
— nnis Sports|Asian GamesAthletics (@nnis_sports) September 28, 2026