WPL Retention | బ్రేకింగ్.. మహిళల ప్రీమియర్ లీగ్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది..!
WPL Retention : మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ వేలానికి సమయం దగ్గరపడుతోంది. దాంతో, ఆనవాయితీ ప్రకారం ప్రధాన క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి ఐదు ఫ్రాంచైజీలు. నిలకడగా రాణిస్తున్న కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకొని.. అవసరం లేదనుకున్న వాళ్లను విడుదల చేశాయి.
WPL Retention : మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్ వేలానికి సమయం దగ్గరపడుతోంది. దాంతో, ఆనవాయితీ ప్రకారం ప్రధాన క్రికెటర్లను అట్టిపెట్టుకున్నాయి ఐదు ఫ్రాంచైజీలు. నిలకడగా రాణిస్తున్న కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకొని.. అవసరం లేదనుకున్న వాళ్లను విడుదల చేశాయి. ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు సోమవారం తమ రిటెన్షన్ జాబితా ప్రకటించాయి. ఊహించినట్టే స్టార్ ప్లేయర్లు తమ స్థానం పదిలం చేసుకోగా.. పేలవ ప్రదర్శన చేసిన కొందరిని వద్దు పొమ్మని వదిలేశాయి.
డబ్ల్యూపీఎల్ ఐదో సీజన్ రిటెన్షన్ జాబితా వచ్చేసింది. వేలానికి సమయం ముంచుకొస్తున్న వేళ ఐదు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న క్రికెటర్ల పేర్లను వెల్లడించాయి. అక్టోబర్ 28న కొచ్చిలో వేలం జరుగనున్నందున.. గడువులోపే రిటైన్ జాబితాను ప్రకటించాయి. ఊహించినట్టుగానే భారత జట్టులోని ప్రధాన ప్లేయర్లు, విదేశీ స్టార్లకు చోటు దక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన సహా 12 మందిని రిటైన్ చేసుకుంది. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం.. ఆరుగురు భారత క్రికెటర్లను, ఐదుగురి విదేశీయులను మాత్రమే అట్టిపెట్టుకుంది.
The crucial choices that will shape the upcoming #TATAWPL Auction! 🔨
It’s Retention Announcement Day! 🥳
Stay tuned ⏳ pic.twitter.com/2Rn1MgndBe
— Women’s Premier League (WPL) (@wplt20) September 28, 2026
వరసగా రెండు ఫైనల్స్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, శ్రీ చరణి, నందిని శర్మ సహా.. మరో మంది భారత స్టార్లు, నలుగురు విదేశీ స్టార్లను అట్టిపెట్టుకుంది. యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ 11 మందిని రిటైన్ చేసుకోగా.. గుజరాత్ జెయింట్స్ అత్యధికంగా 14 మందిని కొనసాగించింది. వచ్చే ఏడాది జనవరి 14న డబ్ల్యూపీఎల్ ఐదో సీజన్ మొదలవ్వనుంది.
The retention lists are OUT 📜
A look at the retained players of all 5️⃣ teams ahead of the #TATAWPL 2027 Auction 🙌 pic.twitter.com/r7xggUgDat
— Women’s Premier League (WPL) (@wplt20) September 28, 2026
ముంబై ఇండియన్స్ : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమన్‌జోత్ కౌర్, రహిలా ఫిరదౌస్, సజీవన సంజన, వైష్ణవి శర్మ, సంస్కృతి గుప్తా.
విదేశీ ప్లేయర్లు – షబ్నం ఇస్మాయిల్, అమేలియా కేర్, నాట్ సీవర్ బ్రంట్, నికోల కారీ, హేలీ మాథ్యూస్,
గుజరాత్ జెయింట్స్ : అనుష్క శర్మ, భారతి ఫుల్మాలి, కనికా ఆహుజా, తనూజ కన్వర్, రాజేశ్వరి గైక్వాడ్, హ్యాపీ కుమారి, కష్వీ గౌతమ్, రేణుకా సింగ్, యస్తికా భాటియా.
విదేశీ ప్లేయర్లు – బేత్ మూనీ, జార్జియా వరేహం, అష్లే గార్డ్నర్, కిమ్ గార్త్, సోఫీ డెవినె,
— Women’s Premier League (WPL) (@wplt20) September 28, 2026
యూపీ వారియర్స్: దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, క్రాంతి గౌడ్, ప్రతీక రావల్, సిమ్రన్ షేక్, శిఖా పాండే, షిప్రా గిరి,
విదేశీ ప్లేయర్లు – మేగ్ లానింగ్, ఫొబే లిచ్‌ఫీల్డ్, సోఫీ ఎకిల్‌స్టోన్, తారా నోరిస్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన(కెప్టెన్), రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సయాలి సత్ఘరే, ప్రేమా రావత్, రీచా ఘోష్, ప్రత్యూష కుమార్ అరుంధతి రెడ్డి.
విదేశీ ప్లేయర్లు – లారెన్ బెల్, ఎలీసా పెర్రీ, నడినే డీక్లెర్క్, జార్జియా వరేహం,
ఢిల్లీ క్యాపిటల్స్: జోమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), షఫాలి వర్మ, శ్రీ చరణి, మమతా మదివల, నందిని శర్మ, నిక్కీ ప్రసాద్, దీయ యాదవ్, మిన్ను మని.
విదేశీ ప్లేయర్లు – అనాబెల్ సథర్లాండ్, లారా వొల్వార్డ్త్, చినొల్లె హెన్రీ, మరిజానే కాప్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

