Contractors | కాంగ్రెస్ సర్కార్ పాలనలో ఉద్యోగులతోపాటు కాంట్రాక్టర్లకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. సెక్రటేరియట్ ముందు కూడా ఇప్పటికే ఉద్యోగులంతా నిరసన కూడా వ్యక్తం చేశారు. తాజాగా కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాట పట్టారు.
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు మరోసారి కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన నిర్వహించారు. తాము ఎన్నిసార్లు కాళ్లరిగేనా తిరిగినా భట్టి విక్రమార్క కలవడం లేదని.. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు వాపోయారు. బిల్లులు ఇస్తారా ఇవ్వరా.. తమకు భట్టితో అపాయింట్మెంట్ ఇప్పించే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రిటైర్డ్ ఉద్యోగులు భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
2024 ఆగస్టు 3న చనిపోయారు. ఈ రోజు వరకు రూపాయి కూడా రాకపోతే కుటుంబం ఎట్లా బతకాలి. ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేది ఎందుకు సార్. ఎట్లా బతకాలి సార్ అంటూ రిటైర్ ఉద్యోగి కుటుంబ సభ్యుడొకరు ఆందోళన వ్యక్తం చేశాడు.
బిల్లులు ఇస్తారా ఇవ్వరా అంటూ భట్టి ఛాంబర్ ముందు ఆందోళన
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు మరోసారి కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన
ఎన్నిసార్లు తిరిగినా భట్టి కలవడం లేదని ఆందోళన
ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని నిరసన
తమకు భట్టితో అపాయింట్… https://t.co/JKK2Rhn0YS pic.twitter.com/rywtWAN7kr
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి