ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ!
‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నాకు అలర్జీ.. మా వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందర్నీ ఫ్రెండ్లీగా చూడటం కరెక్ట్ కాదు.. సమాజంలో పోలీస్ అంటే ఎఫెక్టివ్‌గా కనిపించాలి.. మంచి వాళ్లతో మంచిగా, చెడ్డవాళ్లతో గట్టిగా ఉండాలి.. పోలీసులు వచ్చారంటే రౌడీ గ్యాంగ్‌లు భయపడి పోవాలి’ అని డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- అందర్నీ ఫ్రెండ్లీగా చూడటం కరెక్ట్ కాదు.. సమాజంలో పోలీస్ ఎఫెక్టివ్‌గా కనిపించాలి
- మంచివాళ్లతో మంచిగా.. చెడ్డవాళ్లతో గట్టిగా ఉండాలి: డీజీపీ సీవీ ఆనంద్
నిజామాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నాకు అలర్జీ.. మా వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందర్నీ ఫ్రెండ్లీగా చూడటం కరెక్ట్ కాదు.. సమాజంలో పోలీస్ అంటే ఎఫెక్టివ్‌గా కనిపించాలి.. మంచి వాళ్లతో మంచిగా, చెడ్డవాళ్లతో గట్టిగా ఉండాలి.. పోలీసులు వచ్చారంటే రౌడీ గ్యాంగ్‌లు భయపడి పోవాలి’ అని డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.శనివారం నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న 5వ తెలంగాణ రాష్ట్ర గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2026 ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలు, ఏసీపీలతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పోలీస్‌శాఖలో ఖాళీల భర్తీని వేగవంతంగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 2026, మార్చి 31నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్ సాధించినట్టు వివరించారు. తెలంగాణ మావోయిస్టులు అందరూ సరెండర్ అయ్యారని.. వారిపై నిఘాపెట్టి నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నట్టు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇప్పటికే రూ.6 కోట్ల రివార్డ్ అందించామని, హౌస్ సైట్స్ కూడా ఇస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

