బెంగళూరు: ఒక వ్యక్తి విదేశాల్లో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశాడు. ఉద్యోగం చేసేందుకు భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే బిల్డింగ్ 16వ అంతస్తు పైనుంచి కిందపడి మరణించాడు. ఆ వ్యక్తి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Bengaluru Engineer Dies) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల నిక్షప్, యూరప్‌లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ఇటీవలే బెంగళూరుకు తిరిగి వచ్చాడు. హసరఘట్టలోని గౌడియా మఠంలో కొన్ని రోజులుగా నివసిస్తున్నాడు.
కాగా, బుధవారం బెంగళూరు శెట్టిహళ్లి ప్రాంతంలోని ప్రిన్స్ టౌన్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న తన తల్లిదండ్రులు ఫ్లాట్‌కు నిక్షప్ వెళ్లాడు. అయితే 16వ అంతస్తు నుంచి కిందపడి అతడు మరణించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నిక్షప్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కుమారుడు కొన్నేళ్లుగా స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు నిక్షప్ తండ్రి తెలిపారు.
Also Read:
train delay triggers protest | 9 కిలోమీటర్ల దూరానికి రెండున్నర గంటలు.. రైలు ప్రయాణికులు ఆగ్రహం
boy dies of watching reels | ఫోన్లో రీల్స్ చూస్తూ.. గుండెపోటుతో బాలుడు మృతి