పాట్నా: సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని రైల్వే స్టేషన్కు చేరడానికి ప్యాసింజర్ రైలుకు రెండున్నర గంటల సమయం పట్టింది. మధ్యలో ఆ రైలు సిగ్నల్స్ వద్ద ఆరుసార్లు ఆగింది. ఈ నేపథ్యంలో రైల్వే కొత్తగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (train delay triggers protest) బీహార్లో ఈ సంఘటన జరిగింది. సమస్తిపూర్-బరౌని రైల్వే సెక్షన్లో కొత్తగా ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నారు. అయితే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల వల్ల రైళ్ల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.
కాగా, సమస్తిపూర్-కతిహార్ ప్యాసింజర్ రైలు జనవరి 1న మధ్యాహ్నం 12:55 గంటలకు సమస్తిపూర్ నుంచి బయలుదేరింది. 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజియార్పూర్ స్టేషన్కు పది నిమిషాల్లో చేరుకోవాల్సి ఉంది. అయితే ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ కారణంగా మధ్యలో ఆ రైలు ఆరుసార్లు ఆగింది. ఆగ్రహించిన ప్రయాణికులు లోకో పైలట్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. చివరకు రెండున్నర గంటల ఆలస్యంగా మధ్యాహ్నం 3:38 గంటలకు ఆ స్టేషన్కు రైలు చేరుకున్నది.
మరోవైపు ఆ ఒక్క రోజే ఆ మార్గంలో పలు రైళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. న్యూఢిల్లీ-బరౌని క్లోన్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లతో సహా ఆరు రైళ్లు ఒకే మార్గంలో పలు గంటలు నిలిచిపోయాయి. దీనివల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అయితే ఈ మార్గంలో కొత్గగా ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ కారణంగా గత కొన్ని రోజులుగా రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే తీరుపై మండిపడ్డారు. కాగా, సోన్పూర్ రైల్వే డివిజన్లో సమస్య ఉన్నదని డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
Also Read:
boy dies of watching reels | ఫోన్లో రీల్స్ చూస్తూ.. గుండెపోటుతో బాలుడు మృతి