లక్నో: ఫోన్లో రీల్స్ చూస్తున్న బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. (boy dies of watching reels) ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జుజెలా చక్ గ్రామానికి చెందిన పదేళ్ల మయాంక్ నాలుగో తరగతి చదువుతున్నాడు. జనవరి 4న సాయంత్రం 5 గంటల సమయంలో మంచంపై కూర్చొని మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నాడు. కుటుంబ సభ్యులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు.
కాగా, ఫోన్లో రీల్స్ చూస్తున్న మయాంక్ ఉన్నట్టుండి మంచంపై కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
మరోవైపు మయాంక్ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించకుండానే కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంత చిన్న వయసులో గుండెపోటుతో మరణించడానికి అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియలేదు. అయితే ఫోన్లో రీల్స్ చూస్తూ బాలుడు చనిపోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read:
IAS officer’s rented house | ఇంటిని అద్దెకు ఇచ్చిన ఐఏఎస్ అధికారిణి.. గుట్టుగా వ్యభిచారం