లక్నో: ఐఏఎస్ అధికారిణి తన ఇంటిని అద్దెకు ఇచ్చింది. అయితే అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. (IAS officer’s rented house) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి మూడు నెలల కిందట కిద్గంజ్ ప్రాంతంలోని ఇంటిని సర్వేష్ ద్వివేదికి అద్దెకు ఇచ్చింది. నెలకు రూ.15,000 కిరాయి ఇచ్చేలా వారి మధ్య ఒప్పందం కుదిరింది.
కాగా, ఇంటిని అద్దెకు తీసుకున్న సర్వేష్ ద్వివేది కొన్ని రోజుల పాటు తన కుటుంబాన్ని అక్కడ ఉంచాడు. ఆ తర్వాత వారిని పాత ఇంటికి పంపాడు. ఆ అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. పగలు, రాత్రి మహిళలు, పురుషులు ఆ ఇంట్లోకి వెళ్లి వస్తుండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేశారు. సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. వేర్వేరు గదుల్లో అభ్యంతరకరమైన పరిస్థితుల్లో పురుషులు, మహిళలు ఉన్నట్లు గుర్తించారు. నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో పాటు ప్రధాన నిందితుడు సర్వేష్ ద్వివేదిని అరెస్ట్ చేశారు.
అయితే అరెస్టైన నలుగురు మహిళల్లో ఒకరు పశ్చిమ బెంగాల్, ఒకరు వారణాసి, ఇద్దరు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన వారని పోలీస్ అధికారి తెలిపారు. ప్రధాన నిందితుడు సర్వేష్‌తో సహా ఐదుగురు పురుషులు ప్రయాగ్‌రాజ్ నివాసితులని చెప్పారు. ఐఏఎస్ అధికారిణి అద్దె ఇంట్లో వ్యభిచారం నిర్వహించడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: రెండో భార్య కావాలంటూ.. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వ్యక్తి నిరసన, తర్వాత ఏం జరిగిందంటే?
IED blasts rock Manipur | పేలుళ్లతో దద్దరిల్లిన మణిపూర్.. ఇద్దరికి గాయాలు
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి.. బావిలో పడి వ్యక్తితోపాటు చిరుత మృతి