లక్నో: మణిపూర్ మహిళ, దక్షిణ కొరియా వ్యక్తి సహజీవనం చేస్తున్నారు. మద్యం సేవించే సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆ మహిళ కత్తితో పొడిచి విదేశీ ప్రియుడ్ని హత్య చేసింది. (Woman Stabs Korean Boyfriend) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన డక్ హీ యుహ్ ఒక మొబైల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మణిపూర్‌కు చెందిన లుంజీనా పమైతో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ కలిసి గ్రేటర్ నోయిడాలోని ఎత్తైన అపార్ట్మెంట్లో సహజీవనం చేస్తున్నారు.
కాగా, ఆదివారం ఆ జంట మద్యం సేవించింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో లుంజీనా పమై కత్తితో డక్ హీ ఛాతిపై పొడిచింది. తీవ్రంగా గాయపడిన ప్రియుడ్ని జీఐఎంఎస్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉన్న లుంజీనా పమైను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మద్యం సేవించిన తర్వాత డక్ హీ హింసాత్మకంగా ప్రవర్తించడంతో కత్తితో పొడిచినట్లు పోలీసులకు తెలిపింది. ప్రియుడ్ని చంపడం తన ఉద్దేశం కాదని చెప్పింది. డక్ హీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Leopard Attacks Farmer | రైతుపై చిరుత దాడి.. బావిలో పడి ఇద్దరూ మృతి
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్