బెంగళూరు: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తుల పట్ల ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ విసిగిపోయాడు. తన హెల్మెట్‌ను ఏఐ ట్రాఫిక్ పోలీస్ పరికరంగా మార్చాడు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘులను గుర్తించి నేరుగా పోలీసులకు సమాచారం అందిస్తున్నాడు. (Helmet Into AI Traffic Device) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పంకజ్ తన్వర్ బెంగళూరులోని ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. రోడ్లపై నిత్యం ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుల పట్ల అతడు విసిగిపోయాడు.
కాగా, పంకజ్ తన నాలెడ్జ్‌తో హెల్మెట్‌ను ఏఐ ట్రాఫిక్ పోలీస్ పరికరంగా తీర్చిదిద్దాడు. ఆ హెల్మెట్ ధరించి బైక్‌పై వెళ్తున్నప్పుడు రోడ్డుపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని సులువుగా గుర్తిస్తున్నాడు. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులు ఎలాంటి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నారో అన్నది పసిగడుతున్నాడు. ట్రాఫిక్ ఉల్లంఘన వివరాలు, ఆ వాహనం నంబర్, లొకేషన్ సమాచారాన్ని ట్రాఫిక్ పోలీసులకు చేరవేస్తున్నాడు.
మరోవైపు తన హెల్మెట్‌ను ఏఐ ట్రాఫిక్ పోలీస్ హ్యాకింగ్ పరికరంగా మార్చిన విషయాన్ని పంకజ్ తన్వర్ ఎక్స్‌లో స్వయంగా పేర్కొన్నాడు. అది పనిచేసే విధానాన్ని రియల్‌గా చూపించి వివరించాడు. ఇప్పుడు వాహనదారులు సురక్షితంగా ఉండవచ్చని పేర్కొన్నాడు.
కాగా, పంకజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇలాంటి హెల్మెట్లను దేశ వ్యాప్తంగా తయారు చేస్తే ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గుతాయని కొందరు అభిప్రాయపడ్డారు. కార్లు, ఇతర వాహనాలపై కూడా వినియోగించే పరికరాన్ని తయారు చేయాలని కొందరు సూచించారు.
అయితే పంకజ్ నాలెడ్జ్‌ను అభినందించాలో లేక అతడి పరికరం వల్ల వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బంది గురించి ఆందోళన చెందాలో అన్నది అర్థం కావడం లేదని ఒకరు పేర్కొన్నారు.
i was tired of stupid people on road so i hacked my helmet into a traffic police device 🚨
while i ride, ai agent runs in near real time, flags violations, and proof with location & no plate goes straight to police.
blr people – so now ride safe… or regret it. pic.twitter.com/lWaRO01Jaq
— Pankaj (@the2ndfloorguy) January 3, 2026