‘ప్రగతి ప్రణాళిక’ను పక్కాగా అమలు చేయాలి
జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం తొలి సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి ఆయా శాఖలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మండల అధికారులతో మాట్లాడారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
- రేపటి నుంచి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యక్రమాలు
- జిల్లా అధికారుల తొలి సమీక్ష సమావేశంలో భద్రాద్రి కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేయాలని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం తొలి సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి ఆయా శాఖలపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మండల అధికారులతో మాట్లాడారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు వివిధ అంశాలపై ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ నెల 6 నుంచి 15 వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్ క్లియరెన్స్, రికార్డుల నిర్వహణ, ప్రజలకు సేవలందించడంలో ప్రత్యేక చర్యలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో తడిచెత్త పొడిచెత్త వేరు చేసే కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ భవనాల శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 11 వరకు ఆరోగ్యం,ఆరోగ్యకరమైన ప్రారంభాలు, వైద్యశిబిరాలు, వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ‘సురక్షితంగా చేరుకోండి’ పేరిట రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 20 నుంచి 25 వరకు సంక్షేమ శాఖలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం పై అవగాహన కల్పించాలన్నారు.
27 నుంచి మే 2 వరకు పిల్లల భద్రత, నోడ్రగ్స్పై కళారూపాలు చేయాలన్నారు. మే 4 నుంచి 9 వరకు రైతులు – వ్యవసాయం తదితర అంశాలపై కార్యక్రమాలు ఉంటాయన్నారు. మే 11 నుంచి 16 వరకు, మే 18 నుంచి 23 వరకు, మే 25 నుంచి 30 వరకు, జూన్ 1 నుంచి 12 వరకు వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 99 రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలపై మంత్రుల సమీక్ష కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

