బండ్లగూడ,మార్చి 4: ఉన్నత విద్య కోసం విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలు కావడంతో పాటు వాటి విక్రయానికి పాల్పడిన ఇద్దరు యువకులను హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పాలస్తినా,హూమ్యాన్ దేశస్తులు అబ్డురాబో, హసిన్ అనే ఇద్దరు వ్యక్తులు మన దేశంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చారు. ఇక్కడ మత్తు పదార్థాలకు బానిసలై డ్రైగ్స్ కార్యకలాపాలకు తెరలేపారు. టోలిచౌకి ప్రాంతంలో నివాసం ఉంటు మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు పాల్పడుతున్నారు.
కర్ఱాటకలో నివాసం ఉండే హసన్ అనేక వ్యకి ్త ఢిల్లీలో ఉండే మరో వ్యక్తి చిడ్డితో స్నేహం ఏర్పడింది. కాగా హసన్, అబ్దు రాబోలు చిడ్డి నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నించారు.విషయం తెలుసుకున్న హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బృందం రాజేంద్రనగర్ పోలీస్లతో కలిసి జాయంట్ యాక్షన్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ ఘటనలో అబ్దురాబో, హసన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. 150గ్రాములు (25లక్షల విలువ) మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.