Box Office Collection | హాలీవుడ్ స్టార్ హీరో టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ నివ్ డే’ (Spider-Man: Brand New Day) బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. డెస్టిన్ డేనియల్ క్రీటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెండాయా, జాకబ్ బటాలాన్, సాడీ సింక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్త విడుదలకు ముందే భారత్‌లో గురువారమే విడుదలైన ఈ సినిమా, కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అదరగొట్టింది.
చిత్ర నిర్మాత ప్రకటించిన నివేదిక ప్రకారం.. ఈ సినిమా మొదటి రోజు రూ. 72.44 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టగా, రెండో రోజు రూ. 59.02 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా భారత్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ. 131.46 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటింది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2D, 3D ఫార్మాట్లలో విడుదలైన ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది.