రుద్రంపూర్, ఆగస్టు 1 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేశాడని ఆరోపణలు వెలువడ్డాయి. ఏడో తరగతి చదువుతున్న భుక్య తమన్ తేజ్ అనే విద్యార్థిని తెలుగు ఉపాధ్యాయుడు రాజేందర్ రెడ్డి చితకబాదినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. ఉపాధ్యాయుడు అకారణంగా తమ కుమారుడిపై దాడి చేశాడని, ఈ ఘటనలో విద్యార్థికి గాయాలయ్యాయని తల్లిదండ్రులు తెలిపారు. బాధ్యుడైన ఉపాధ్యాయుడు రాజేందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టినట్లు సమాచారం. అలాగే పాఠశాల యాజమాన్యం కూడా ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.

విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు ?