ముంబై: రైతుపై చిరుత దాడి చేసింది. ప్రాణాలు దక్కించుకునే క్రమంలో రైతు బావిలో పడ్డాడు. చిరుత కూడా ఆ బావిలో పడింది. ఈ నేపథ్యంలో రైతు మరణించగా చిరుత కూడా చనిపోయింది. (Leopard Attacks Farmer) మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సావ్తా మాలి గ్రామానికి చెందిన గోరఖ్ జాదవ్ రైతు. ఆదివారం మధ్యాహ్నం శివ్‌డే ప్రాంతంలోని పొలంలో పని చేశాడు. చేనుకు నీరు పెట్టిన తర్వాత భోజనం చేస్తున్నాడు.
కాగా, ఆ ప్రాంతంలో దాగిన చిరుత రైతు గోరఖ్ జాదవ్‌పై దాడి చేసింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో చిరుతతో పాటు సమీపంలోని బావిలో పడిపోయాడు. చిరుత దాడిలో గాయపడిన ఆ రైతు బావిలో మరణించాడు.
మరోవైపు గ్రామస్తులు ఆ బావి చుట్టూ చేరారు. అందులో పడిన చిరుత గాయపడినప్పటికీ ప్రాణాలతో ఉన్నది. ఈ సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే చిరుత దాడిలో రైతు గోరఖ్ మరణించడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఆ చిరుతను రక్షించడాన్ని వారు అడ్డుకున్నారు.
అయితే అటవీ శాఖ అధికారులు, పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గాయాలతో మూడు గంటలకుపైగా బావిలో ఉన్న చిరుత కూడా చివరకు అందులో మరణించింది. రైతు గోరఖ్ మృతదేహాన్ని ఆ బావి నుంచి వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అటవీ శాఖ సిబ్బంది చిరుత కళేబరాన్ని బయటకు తీశారు. నిబంధనల ప్రకారం ఖననం చేసేందుకు తీసుకెళ్లారు.
Also Read:
Man Murders Woman Friend, Sucide | చిన్ననాటి స్నేహితురాలిని హత్య చేసిన వ్యక్తి.. ఆ తర్వాత ఆత్మహత్య
Sacrifice For Treasure | గుప్త నిధుల కోసం బాలుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం.. కాపాడిన అధికారులు
Watch: హైవే డివైడర్‌పై థార్‌తో డేంజరస్ స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?