లక్నో: ఒక వ్యక్తి హైవే డివైడర్‌పై థార్‌తో ప్రమాదకరంగా విన్యాసాలు చేశాడు. సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ఆ వాహనాన్ని నడిపాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Dangerous Stunt With Thar) ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఈ సంఘటన జరిగింది. ఒక వ్యక్తి మహీంద్రా థార్‌ను నిర్లక్ష్యంగా నడిపాడు. రోడ్డు డివైడర్‌పై వేగంగా దూసుకెళ్లాడు. ఆ తర్వాత రాత్రి వేళ సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ఆ వాహనాన్ని నడిపాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిర్లక్ష్యంగా థార్‌ను నడపటం, డేంజరస్ స్టంట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. నంబర్ ప్లేట్ ఆధారంగా థార్ యజమానిని వివేక్ యాదవ్‌గా గుర్తించారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయడంతోపాటు క్షమాపణలు చెప్పించారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
थार का स्टीयरिंग संभालते ही क्या लोग कायदे–कानून भूल जाते हैं? शायद इसलिए ये गाड़ी सिर्फ लफंगों की पहचान बनी हुई है।
यामाहा राजदूत को लोग उसकी “धक–धक” आवाज की वजह से रास्ता देते थे, लेकिन थार को इसलिए रास्ता देते हैं कि पता नहीं कौन लफंगा बैठा हो।@amrohapolice देखिए जरा… pic.twitter.com/wZXG0SIx9P
— Sachin Gupta (@SachinGuptaUP) January 4, 2026
Also Read:
Man Murders Woman Friend, Sucide | చిన్ననాటి స్నేహితురాలిని హత్య చేసిన వ్యక్తి.. ఆ తర్వాత ఆత్మహత్య
Sacrifice For Treasure | గుప్త నిధుల కోసం బాలుడ్ని బలి ఇచ్చేందుకు యత్నం.. కాపాడిన అధికారులు
Massive Fire At Railway Station | రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. 200కు పైగా వాహనాలు దగ్ధం