Peddi | పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలయికతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ లిరికల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చి స్వయంగా ఆలపించడం విశేషం. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం మాస్, మోటివేషనల్ టచ్‌తో ఆకట్టుకుంటోంది. జానీ మాస్టర్ రూపొందించిన కొరియోగ్రఫీ ఈ సాంగ్‌కు హైలైట్‌గా నిలిచింది.
ముఖ్యంగా రామ్ చరణ్ వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు, ఫాస్ట్ మూమెంట్స్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి. కొందరు అభిమానులు ఆయన డ్యాన్స్‌ను ‘చిరుత’ రోజుల్ని గుర్తు చేసేలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటపై మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసలు కురిపించారు. ‘రై రై రా రా’ సాంగ్ ఎనర్జీ, ఎమోషన్, సినీమాటిక్ బ్రిలియన్స్‌తో అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. రామ్ చరణ్ డ్యాన్స్ తనను ఎంతో గర్వపడేలా చేసిందని, స్క్రీన్‌పై ఆయన గ్రేస్ ప్రత్యేకంగా మెరిసిందని వ్యాఖ్యానించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ అందరి కృషి వల్లే ఈ సాంగ్ మరోస్థాయికి వెళ్లిందని అభినందించారు. ఈ ప్రశంసలకు బుచ్చిబాబు సానా భావోద్వేగంగా స్పందిస్తూ, మెగాస్టార్ నుంచి వచ్చిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయని తెలిపారు.
రికార్డుల విషయానికి వస్తే, విడుదలైన 24 గంటల్లోనే ‘రై రై రా రా’ లిరికల్ వీడియో 46.1 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో అత్యధిక వ్యూస్ అందుకున్న లిరికల్ సాంగ్‌గా నిలిచింది. మాస్ బీట్, ఎనర్జిటిక్ ట్యూన్, రామ్ చరణ్ డ్యాన్స్ అన్నీ కలిసి ఈ రికార్డు సాధించడంలో కీలక పాత్ర పోషించాయి.అయితే టాప్ లిరికల్ వ్యూస్ జాబితాలో రెండో స్థానంలో కూడా ‘పెద్ది’ చిత్రానికే చెందిన ‘చికిరి చికిరి’ పాట 29.19 మిలియన్ వ్యూస్‌తో నిలవడం విశేషం. మూడో స్థానంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలోని ‘దేఖ్లేంగే సాలా’ 28.53 మిలియన్ వ్యూస్ సాధించింది. నాలుగో స్థానంలో పుష్ప2 లోని ‘కిస్సిక్’ పాట 27.19 మిలియన్ వ్యూస్‌తో నిలిచింది. ఐదో స్థానంలో గేమ్ ఛేంజర్ చిత్రంలోని ‘నా నా హైరానా’ 23.44 మిలియన్ వ్యూస్ సాధించింది. ఆరో స్థానంలో ది ప్యారడైజ్ చిత్రంలోని ‘ఆయా షేర్’ పాట 21.74 మిలియన్ వ్యూస్‌తో నిలిచింది.మొత్తానికి, టాలీవుడ్లో ఇప్పుడు లిరికల్ వీడియోలు కూడా సినిమా ప్రమోషన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.