Allu Arjun | పావలా శ్యామలకు అల్లు అర్జున్ భరోసా.. నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం!
Allu Arjun | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ప్రస్తుత దీనస్థితిని ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే.
Pavala Shyamala | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ప్రస్తుత దీనస్థితిని ఎదుర్కోంటున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె, ప్రస్తుతం తన కుమార్తెతో కలిసి సికిందరాబాద్ కార్ఖానా ప్రాంతంలోని ఆర్కే ఫౌండేషన్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కనీస మందుల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్, వెంటనే స్పందించి వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాడు.
పావలా శ్యామల, ఆమెకూతురు నిత్యవసరాలు, వైద్య ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా 10 వేల రూపాయల ఆర్థిక సాయం క్రమం తప్పకుండా అందేలా శాశ్వత ఏర్పాట్లు చేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గతంలో చిరంజీవి వంటి పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఆర్థికంగా సాయం అందించినప్పటికీ, బన్నీ ఇప్పుడు ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి నెలా ఫిక్స్డ్ అమౌంట్ పంపేలా నిర్ణయం తీసుకోవడం విశేషం. కష్టాల్లో ఉన్న తోటి కళాకారులను ఆదుకోవడంలో అల్లు అర్జున్ చూపిస్తున్న ఈ చొరవ పట్ల చిత్ర పరిశ్రమతో పాటు సామాన్య ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

