Benny Blanco | ప్రముఖ హాలీవుడ్ సింగర్, నటి సెలీనా గోమెజ్ (Selena Gomez) తన ప్రియుడు బెన్నీ బ్లాంకో (Benny Blanco) పట్ల చూపిస్తున్న ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బెన్నీ బ్లాంకో ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతుండగా.. సెలీనా అతడి పాదాలను ముద్దాడుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే, ఆ పాదాలు కాస్త మురికిగా ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది దీనిని స్వచ్ఛమైన ప్రేమ అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కాస్త వింతగా, అసహ్యంగా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Selena Gomez doesn’t seem to mind Benny Blanco’s dirty feet because during her appearance on her husband Benny’s podcast, she kissed and snuggled them. 😵💫 pic.twitter.com/lAB4sikNUq
— TMZ (@TMZ) March 3, 2026