బెంగళూరు: గుప్త నిధుల కోసం పసి బాలుడ్ని బలి ఇచ్చేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆ ఇంటికి చేరుకున్నారు. సకాలంలో బాలుడ్ని రక్షించారు. శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Sacrifice For Treasure) కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 3న సయ్యద్ ఇమ్రాన్ ఇంట్లో గుప్త నిధుల కోసం పూజలు నిర్వహించారు. ఇంట్లోని ఒక చోట గొయ్యి తవ్వారు. ఏడాదిన్నర వయస్సున్న బాలుడ్ని నర బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
కాగా, గుర్తు తెలియని వ్యక్తులు బాలల సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విభాగం అధికారులు, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. గదిలో ఒక చోట గొయ్యి తవ్వి పూజలు చేయడాన్ని పరిశీలించారు. ఆ క్రతువును నిలిపివేశారు. నర బలి ఇస్తున్నట్లుగా అనుమానించిన ఏడాదిన్నర బాలుడ్ని స్వాధీనం చేసుకున్నారు. శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Retired Teacher, Wife Found Dead | రిటైర్డ్ టీచర్, భార్య అనుమానాస్పద మృతి.. హత్యగా పోలీసులు అనుమానం
Woman Kills Daughter-In-Law | కొడుకు గ్రాట్యుటీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం.. కోడలిని చంపిన అత్త
Priyanka Gandhi | ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు.. అస్సాం ఎన్నికల ప్యానెల్‌కు నేతృత్వం
Massive Fire At Railway Station | రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం.. 200కు పైగా వాహనాలు దగ్ధం