హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): నిరుడు నవంబర్లో ప్రారంభించిన మీసేవ వాట్సాప్ సేవలకు విశేష స్పం దన లభిస్తున్నదని, గడచిన మూడు నెలల్లో 8 లక్షలకుపైగా లావాదేవీలు నమోదైనట్టు అధికారులు తెలిపారు. తాజాగా విద్యార్థులు టెన్త్ హాల్ టికెట్లు పొందే సేవలు కూడా అందుబాటులో ఉన్నట్టు, మొదటిరోజే 30 వేలమంది విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు.
మీ-సేవ వాట్సాప్ సేవల్లో ప్రధానంగా జనన, ఆదాయ ధ్రువీకరణ, వెహికల్ చలాన్, విద్యుత్తు బిల్లు చెల్లింపులు తదితర సేవలకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా టెన్త్ విద్యార్ధులు తమ వివరాలు అందించి సులభంగా హాల్ టికెట్ పొందవచ్చని పేర్కొన్నారు.