Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ‘రంగస్థలం’ తర్వాత పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ‘పహిల్వాన్’ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. చరణ్ మాస్ లుక్, ఆయన నటన మెగా అభిమానులను ఫుల్ జోష్‌లోకి తీసుకెళ్లింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్‌పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదటగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 30న విడుదల కాకుండా జూన్‌కు వాయిదా పడుతుందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో రిలీజ్ డేట్ ప్రస్తావించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కావడానికి సుమారు 20 రోజులు ఉందని, ఒక ఐటెం సాంగ్ పెండింగ్‌లో ఉందని, పోస్ట్ ప్రొడక్షన్ సమయానికి పూర్తవుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ‘రాకాస’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన, ‘పెద్ది’ వాయిదా పడటం లేదని స్పష్టం చేశారు. ప్లాన్ ప్రకారం సినిమా ఏప్రిల్ 30నే థియేటర్లలోకి వస్తుందని బలమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే చిత్ర యూనిట్ వేగంగా పనులు పూర్తి చేస్తోంది. మిగిలిన షూటింగ్‌ను, ముఖ్యంగా ఐటెం సాంగ్‌ను, కేవలం వారం రోజుల్లో ముగించి ఫైనల్ అవుట్‌పుట్ సిద్ధం చేయడానికి మేకర్స్ కృషి చేస్తున్నారు. ఇక రిలీజ్‌పై వస్తున్న రూమర్లు కేవలం పుకార్లేనని డిస్ట్రిబ్యూటర్ల సమాచారం చెబుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఏప్రిల్ 8 నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో ఏప్రిల్ 30 రిలీజ్ దాదాపు ఖాయం అయిందని సినీ వర్గాలు అంటున్నాయి.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ‘అచ్చయ్యమ్మ’ పాత్రలో కనిపించనుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ‘గౌర్నాయుడు’గా, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ ‘రాంబుజ్జి’గా నటిస్తున్నారు. అలాగే జగపతి బాబు ‘అప్పలసూరి’ పాత్రలో కీలకంగా కనిపించనున్నారు. వీరితో పాటుబొమన్ ఇరాని, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాకు సంగీతాన్ని ఆస్కార్ విజేత రెహమాన్ అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది.