న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ (Netflix) సీఈవో టెడ్ సారండోస్ బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఆ ఇద్దరూ విస్తృత స్థాయిలో చర్చించుకున్నారు. భారతీయుల స్టోరీటెల్లింగ్ సామర్థ్యాన్ని కూడా డిస్కస్ చేసుకున్నారు. సృజనాత్మకత కలిగిన భారతీయులకు నెట్‌ఫ్లిక్స్ సీఈవో సారండోస్ ఆహ్వానం పలికారు. తమ ఫాట్ఫామ్ను వినియోగించి అద్భుతమైన కథలను చెప్పాలన్నారు. భారతీయులు ఎటువంటి కథలను చెప్పబోతారో అన్న ఆసక్తితో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్‌లోకి నెట్‌ఫ్లిక్స్ ప్రవేశించి పదేళ్లు అవుతోంది. సీఈవో టెడ్ సారండోస్ ఇవాళ ప్రధాని మోదీని కలవడం సంతోషంగా ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ కంపెనీ తన స్టేట్మెంట్లో తెలిపింది. భారతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమను విశ్వస్థాయికి తీసుకెళ్లే అంశాన్ని చర్చించినట్లు చెప్పారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా స్టోరీటెల్లింగ్ ఇన్స్యేటివ్ను ఆవిష్కరిస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఐఐసీటీ, ఎన్ఎఫ్డీసీతో కలిసి భవిష్యత్తు తరాలకు చెందిన భారత క్రియేటవ్ టాలెంట్‌ను ప్రోత్సహించనున్నారు. ఇండియా తన రాబోయే రోజుల్లో ఎటువంటి సృజనాత్మకను ప్రదర్శిస్తుందో చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. భారత మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సామర్ధ్యాన్ని డిస్కస్ చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. స్టోరీటెల్లింగ్ అంశంలో భారత్‌కు సుసంపన్న సంప్రదాయం ఉందని, అసాధారణ రీతిలో క్రియేటివ్ ట్యాలెంట్ ఉందన్నారు. కాంటెంట్ క్రియేషన్‌లో ఇండియా బలోపతంగా ఉన్నట్లు చెప్పారు.
Glad to have met Mr. Ted Sarandos. Discussed the immense potential of India’s media and entertainment sector.
India has a rich tradition of storytelling and an extraordinary pool of creative talent, which can be leveraged to strengthen our nation’s position as a global hub for… https://t.co/8ufUEddPTv
— Narendra Modi (@narendramodi) August 5, 2026