Free Bus | ఫ్రీ బస్సే కదా గు.. మూసుకొని బస్సు ఎక్కు…. బత్తలపల్లిలో మహిళతో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన!
Free Bus | అనంతపురం జిల్లా బత్తలపల్లిలో బస్సు ఎక్కుతుండగా ఆర్టీసీ డ్రైవర్ అసభ్యంగా మాట్లాడాడని మహిళ ఆరోపిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది.
Free Bus | ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న మహిళతో డ్రైవర్ అసభ్యంగా మాట్లాడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. బత్తలపల్లిలో బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన సమయంలో డ్రైవర్ తనను అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపిస్తూ ఓ మహిళ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగింది.
బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు అసభ్య పదజాలంతో మాట్లాడాడని మహిళ తెలిపింది. ‘‘ఫ్రీ బస్సే కదా.. గు.. మూసుకొని బస్సు ఎక్కు’’ అంటూ తనను అవమానించేలా మాట్లాడాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది.
ఫ్రీ బస్సే కదా గు.. మూసుకొని బస్సు ఎక్కు..!
అనంతపురం జిల్లాలో మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్
బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా డ్రైవర్ అసభ్య పదజాలంతో దూషించాడంటూ కలెక్టర్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళ
ఆర్టీసీ డ్రైవర్ పై దాడికి యత్నించిన… pic.twitter.com/ODUuuPu1KT
— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
డ్రైవర్‌పై దాడికి యత్నం
మహిళకు జరిగిన అవమానంపై ఆగ్రహించిన ఆమె బంధువులు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మహిళ ఫిర్యాదుపై ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు, ఆమె బంధువులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

