దేశంలో రాజ్యాంగానికి ఏదీ రక్షణ?
భారత రాజ్యాంగం మనకు మౌలిక ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను ప్రసాదించింది. సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వంతో అనుసంధానించింది. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులు, న్యాయం వంటి గొప్ప విలువలను నేర్పుతుంది.
26న రాజ్యాంగ దినోత్సవం
దేశంలో పన్నెండేండ్ల బీజేపీ పాలన రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడుతూ సాగుతున్నది. ప్రజలపై మతతత్వ రాజకీయాలను రుద్దుతున్నది. లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామిక స్ఫూర్తిని విలువలను కాలరాస్తున్నది. కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వక్రీకరిస్తున్నది. విద్యావ్యవస్థ డబ్బున్నవాళ్లకే చేరువవుతున్నది.
ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద ఆధిపత్యం కోసం ప్రైవేట్ కాలేజీలు దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి. రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26ను కేంద్రం 2015లో రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది. అప్పట్నుంచీ రాజ్యాంగ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకొంటున్నాం. ఈ నేపథ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ ఎలా ఉల్లంఘిస్తున్నదో పరిశీలిద్దాం.
భారత రాజ్యాంగం మనకు మౌలిక ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను ప్రసాదించింది. సామాజిక ప్రజాస్వామ్యాన్ని స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వంతో అనుసంధానించింది. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులు, న్యాయం వంటి గొప్ప విలువలను నేర్పుతుంది. కుల, మత, ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా ప్రతి పౌరుడు గౌరవంగా జీవించేలా ఇది తోడ్పడుతుంది. పౌరుల హక్కులతోపాటు బాధ్యతలను కూడా మనం నిజాయితీగా నిర్వర్తించాలి. రాజ్యాంగం ప్రకారం మన దేశాన్ని పాలించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వ అధినేతలపై ఉన్నది. పన్నెండేండ్ల బీజేపీ పాలనా విధానాన్ని చూసినట్టయితే భారత రాజ్యాంగాన్ని వారికి అనుకూలంగా మార్చుకోవాలనే కుట్ర, మతతత్వాన్ని ప్రజలపై రుద్దాలనే ప్రయత్నాలు కనిపిస్తాయి.
మనది లౌకిక దేశం అనే విషయాన్ని విస్మరించి, రాజ్యాంగ విలువలను పక్కనపెట్టి బీజేపీ, అనుబంధ విభాగాలు విద్వేష భావజాలాన్ని ప్రజలపై రుద్దేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. బీజేపీ జాతీయ నాయకులు, పాలకులు రాజ్యాంగంలోని లౌకికవాద లక్షణాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తొలగించాలని బీజేపీ నేతలు అనడం నుంచి అందుకోసం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు పరిస్థితి చేరుకున్నది. బీజేపీ నేతల పాలనలో దేశ లౌకికవాదం అపహాస్యానికి గురవుతున్నది. విద్యా వ్యవస్థలోనూ మతాన్ని జొప్పించేందుకు పాలకులు యత్నిస్తున్నారు. సమాజంలో మతాల ప్రాతిపదికగా వర్గాల మధ్య శత్రుత్వ భావాలను వ్యాప్తి చేసే విచ్ఛిన్నకర ఆలోచనలను ఆచరణలో పెడుతున్నారు. అధికారిక, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు మతసంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. కానీ బీజేపీ నేతలు నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా పాల్గొంటున్నారు.
దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసే రాజ్యాంగాన్ని స్మరించుకునే రోజు నవంబర్ 26. భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ (రచనా సంఘం) అధ్యక్షుడిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, మన దేశ పరిస్థితులకు అవసరమయ్యే అంశాలను మాత్రమే స్వీకరించి, రాజ్యాంగంలో పొందుపరిచారు. అతిపెద్ద దృఢమైన రాజ్యాంగాన్ని రెండేండ్ల 11 నెలల 18 రోజులు శ్రమించి 395 అధికరణలతో, 22 భాగాలు, 9 షెడ్యూళ్లతో రూపొందించా రు. ఆ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. తర్వాత ఇప్పటివరకు రాజ్యాంగంలో 444 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లు, 26 భాగాలు, 126 సవరణలు జరిగాయి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు ను రిపబ్లిక్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయం. రాజ్యాంగ పీఠికలో ‘భారతదేశ ప్రజలమైన మేం దేశ సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని భావం, భావప్రకటన విశ్వాసం, ధర్మం, ఆరాధన, స్వేచ్ఛ స్వాతంత్య్రాన్ని అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మన రాజ్యాంగ పరిషత్‌లో 1949 నవంబర్ 26న అంగీకరించుకొని శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేం సమర్పించుకుంటున్నాం’ అని రాసుకున్నాం.
బీజేపీ రాజకీయాల్లో, అధికారంలో మతం భాగమైంది. విద్యారంగ పాఠ్యప్రణాళికల్లో, విధాన నిర్ణయకర్తల్లో, విధానాల్లో ఆధిపత్య మతభావాలను జొప్పిస్తున్నారు. దేశంలో మొత్తంగా విద్యను మత భావనలతో బీజేపీ, అనుబంధ విభాగాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా యూ జీసీ తీసుకొచ్చిన వివాదాస్పద కోర్సులు ఇందుకు నిదర్శనం. మతం కోణంలోనే పాఠ్య పుస్తకాల సిలబస్ మార్చారు. విలువలతో కూడిన విద్య పేరిట మతపరమైన అంశాలను చేర్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మార్పులను నాటి విపక్షాలు, మేధావులు, రాజ్యాంగ నిపుణులు, చరిత్రకారులు వ్యతిరేకించారు. ప్రభు త్వం చరిత్రను వక్రీకరిస్తున్నదని అన్నారు. ఈ క్రమంలోనే విద్యారంగాన్ని మొత్తం ప్రైవేట్ శక్తులకు అప్పజెప్పేందుకు కేంద్రం అడుగులు వేస్తున్నది. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం వల్ల డబ్బు ఉన్న వారికే విద్య అందుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యాలయాల మీద, విద్యా వ్యవస్థ మీద ఆధిపత్యం కొనసాగించడానికి ప్రైవేట్ కాలేజీలు అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నాయి.
అందులో భాగంగానే పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తికి గురై, ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారు. నీట్ పేపర్ వరుస లీకేజీలకు వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి, యువజన సంఘాలు పోరాడాయి. ఆ పోరాటం ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకతప్పలేదు.
మరోవైపు ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేని, అవినీతిలో కూరుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ప్రజల మనోభావాలను ఆసరా చేసుకొని అధికారంలో కొనసాగాలని చూస్తున్నది. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఈసీ ద్వారా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-‘సర్’ను తెరపైకి తీసుకొచ్చింది. దేశంలోని 13 కోట్లకు పైగా పౌరుల ఓటు హక్కును రద్దు చేసింది.
ప్రస్తుతం ‘సర్’కు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా, దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగుతున్నది. రిటైర్డ్ న్యాయమూర్తులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు ఉద్యమాల్లో భాగస్వాములవుతూ, ప్రజలను చైతన్యం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ విలువల ప్రకారం పరిపాలించాల్సిన బాధ్యత దేశాధినేతలపై ఉన్నది. అదేవిధంగా రాష్ర్టాధినేతలు కూడా అదే విధమైన పాలన సాగించాలి. పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ, మతపరమైన విభజన తీసుకొస్తున్న నేపథ్యంలో విచ్ఛిన్న రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య పార్టీలు, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు, పౌరులందరిపైనా ఉన్నది. దేశ ఐక్యత, సమగ్రత కోసం అందరూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా గళమెత్తాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. అదే రాజ్యాంగ దినోత్సవానికి నిజమైన గౌరవం.
ప్రస్తుతం ‘సర్’కు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా, దేశ వ్యాప్తంగా ఉద్యమం సాగుతున్నది. రిటైర్డ్ న్యాయమూర్తులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు ఉద్యమాల్లో భాగస్వాములవుతూ, ప్రజలను చైతన్యం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆ విలువల ప్రకారం పరిపాలించాల్సిన బాధ్యత దేశాధినేతలపై ఉన్నది.
(వ్యాసకర్త: రిటైర్డ్ టీచర్ల సంఘం నాయకుడు )
కందుకూరి దేవదాసు
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

