మణి కుటుంబానికి అండగా ఉంటాం
ఎర్రవల్లిలోని నివాసంలో సహాయకుడిగా పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్కు చెందిన కస్తూరి మహేందర్‌రెడ్డి (మణికుమార్) మృతికి బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మణి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
- ఎర్రవల్లి కార్యాలయ సహాయకుడు మణికుమార్ మృతికి కేసీఆర్, కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
- కేసీఆర్ ఆదేశాల మేరకు అంత్యక్రియలకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
- నివాళులర్పించి కుటుంబసభ్యులకు పరామర్శ
- మణి సోదరి చదువు, వివాహ బాధ్యతలు కేసీఆర్ చూసుకుంటారని కుటుంబానికి భరోసా
- పాడె మోసి కన్నీటి వీడోలు పలికిన కేసీఆర్ సిబ్బంది
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)/రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్: ఎర్రవల్లిలోని నివాసంలో సహాయకుడిగా పనిచేస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్కు చెందిన కస్తూరి మహేందర్‌రెడ్డి (మణికుమార్) మృతికి బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మణి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ కార్యాలయ అటెండర్‌గా పనిచేస్తున్న మహేందర్‌రెడ్డి (25) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని తన స్వగ్రామమైన బందనకల్‌లో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బైక్‌పై వెళ్తున్న మణిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. మణి మరణవార్త తెలిసిన వెంటనే కేసీఆర్, కేటీఆర్ బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
కొన్నేండ్లుగా పనిచేస్తున్న మణికుమార్ తమ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారని, ఆయన అకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని కేసీఆర్ సతీమణి శోభమ్మ, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు ఆవేదన వ్యక్తంచేశారు. మణి కుటుంబసభ్యులకు అండగా నిలువాలని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆదేశించారు. మణికుమార్ అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాలని సంతోష్‌కుమార్, ముస్తాబాద్ మాజీ జడ్పీటీసీ శరత్‌రావుకు కేసీఆర్ సూచించారు. మణికుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సిరిసిల్ల ప్రాంతీయ దవాఖానలో ఉంచిన మణికుమార్ మృతదేహాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గితే పరిశీలించారు.
పాడె మోసిన సంతోష్‌కుమార్
కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ మంగళవారం బందనకల్‌కు చేరుకొని మణి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళ్లర్పించడంతోపాటు అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. స్వయంగా పాడె మోసి మణితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మణి సోదరి చదువు, వివాహ బాధ్యతలను తానే తీసుకుంటానని, అతని తండ్రి, నానమ్మ ఆరోగ్య బాగోగులను కూడా చూసుకొంటానని కేసీఆర్ తరఫున సంతోష్‌కుమార్ భరోసా ఇచ్చారు. అంత్యక్రియల్లో బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పార్టీ నేతలు జనగామ శరత్‌రావు, అంజిరెడ్డి, జుబేర్, కేసీఆర్ పీఎస్ నాగేందర్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- KCR
- Mani Kumar
- santosh kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

