బీఆర్ఎస్ సవాల్.. కాంగ్రెస్ బేజార్!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు రెండురోజుల క్రితం వరంగల్‌లో పాల్గొన్న జనచైతన్య సభ తో కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరుగుతున్న ది. ఆ సభలో కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కేటీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలారు. ఆయన సవాల్‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రతి సవాల్ విసరడంతో సహించలేని కాంగ్రెస్ గూండాలు ఏకంగా హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడికి దిగారు.
- బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాల దాడి
- గట్టిగా ఎదిరించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
- బీఆర్ఎస్ శ్రేణులపైనే లాఠీ ఝుళిపించిన పోలీసులు
- కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసుల సహకారం
- కేటీఆర్ వరంగల్ సభతో కాంగ్రెస్‌లో తీవ్ర అసహనం
- కేటీఆర్ ఇక్కడే పోటీ చేయాలన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
- నువ్వే రాజీనామా చేయాలని ఎమ్మెల్యేకు దాస్యం ప్రతి సవాల్
- సాయంత్రం ఐదు వరకు గడువు
- నాయిని స్పందించకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తల నిరసన
హనుమకొండ, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు రెండురోజుల క్రితం వరంగల్‌లో పాల్గొన్న జనచైతన్య సభ తో కాంగ్రెస్ పార్టీలో అసహనం పెరుగుతున్న ది. ఆ సభలో కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కేటీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలారు. ఆయన సవాల్‌కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ప్రతి సవాల్ విసరడంతో సహించలేని కాంగ్రెస్ గూండాలు ఏకంగా హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడికి దిగారు.
కార్యకర్తలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి దిగారు. దీనికి ప్రతిగా పెద్ద ఎత్తున కార్యాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించాయి. ఈ సందర్భంగా పోలీసులు మా త్రం అధికార పార్టీకి వత్తాసు పలుకడం, బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జికి దిగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండలో ఆదివారం జరిగిన జనచైతన్య సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వరంగల్ సమగ్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు.
మూడేండ్లుగా కాం గ్రెస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదని, సంక్షేమాన్ని పూర్తిగా మరిచిందని విమర్శించారు. సభకు వచ్చిన భారీ స్పందనతో కాంగ్రెస్ పార్టీలో అసహనం నెలకొన్నది. కేటీఆర్ సభ మరుసటిరోజు సోమవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు. వరంగల్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించకుండా కేటీఆర్‌పై విమర్శలకు దిగారు. బీఆర్ఎస్ తరఫున వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలంటూ సవాల్ చేశారు.

నాయిని సవాల్‌కు స్పందించిన దాస్యం
కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌పై పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ వెంటనే స్పందించా రు. నాయిని రాజేందర్‌రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధిష్ఠానం ఎవరిని పోటీకి నిలిపినా, తనను నిలిపినా పోటీ చేసేందుకు సిద్ధమేనని, ఆ ఎన్నిక ల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలువకపోతే తాను ఏ ఎన్నికల్లోనూ పోటీచేయబోనని ప్రకటించారు. మొదట సవాల్ చేసిన నాయిని రాజేందర్‌రెడ్డి గడువులోపు స్పందించకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవా రం సాయంత్రం 5 తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు యత్నించగా, కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు.
ఈ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగానే ఎదిరించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకే సహకరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై లాఠీచార్జి చేశారు. కాంగ్రెస్ దాడులు, బీఆర్ఎస్ నిలువరింపు, పోలీసుల లాఠీచార్జితో మూడు గంటలపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజీమానాపై స్పందించని ఎమ్మెల్యే నాయిని ఆదేశాలతోనే కాంగ్రెస్ కార్యకర్తలు తమపై దాడి చేశారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. పోలీసులు ముందుగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించగా, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశా రు. ఎమ్మెల్యే నాయిని సవాల్ చేసి పారిపోయారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.

కాంగ్రెస్ కార్యకర్తల రాళ్ల దాడి
హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఉన్న పార్టీ శ్రేణులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతోపాటు కర్రలతో దాడి కి యత్నించారు. బీఆర్ఎస్ ఆఫీసులోని ఫ్లెక్సీలను చించివేసి ఇష్టారాజ్యంగా దౌర్జన్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ నాయకులు పల్లె రాహుల్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, జగ్జీవన్ బీఆర్ఎస్ ఆఫీసులో ని ఆ పార్టీ నేతలపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసి రెచ్చగొట్టారు. కాంగ్రెస్ దాడిలో పలువురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. ఇదే సమయంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు సహకరించారు. కాం గ్రెస్ దాడిని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా ఎదిరించారు. బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.
ఠాణాలో కాంగ్రెస్ శ్రేణులకు మర్యాదలు
సుబేదారి, నవంబర్ 24: బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు హనుమకొండ ఠాణాలో పోలీసులు రాచమర్యాదలు చేయడం వివాదాస్పదంగా మారిం ది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ కాంగ్రెస్ కార్యాలయం నుంచి హనుమకొండ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. ఇదే సమయం లో వినయ్‌భాస్కర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలకు దిగారు. ఈ క్రమం లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో 35 మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి హనుమకొండ ఠాణాకు తరలించారు. అక్కడ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అధికార పార్టీ కార్యకర్తలకు కుర్చీలు వేసి, ఛాయ్ పోసి రాచమర్యాదలు చేశారు. అధికార పార్టీ కార్యకర్తలను కుర్చీల్లో కూర్చోబెట్టి టీ తాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KTR
- Political Clash
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

