సంగీతభరితంగా హే కన్నమ్మ
యశ్వంత్, ధనశ్రీవర్మ ప్రధానపాత్రల్లో నటించిన యువతరం ప్రేమకథ ‘హే కన్నమ్మ’. శశికుమార్ ముత్తులూరి దర్శకుడు.
యశ్వంత్, ధనశ్రీవర్మ ప్రధానపాత్రల్లో నటించిన యువతరం ప్రేమకథ ‘హే కన్నమ్మ’. శశికుమార్ ముత్తులూరి దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ ఎల్ఎల్పీ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మించిన ఈచిత్రం ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరో యశ్వంత్ మాట్లాడుతూ ‘వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండే కథ ఇది. అన్ని వయసుల వారికీ ఈ కథ కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. నాకీ అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి ధన్యవాదాలు’ అన్నారు. ‘అద్భుతమైన మ్యూజికల్ లవ్‌స్టోరీ ఇది. యశ్వంత్, ధనశ్రీ తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కుతుంది. అలాగే తేలిక పడుతుంది. ఇది తన ప్రామిస్’ అని దర్శకుడు శశికుమార్ ముత్తులూరి అన్నారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. కార్తీక మురళీధరన్, వెంకటేశ్ కాకుమాను, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: రాంపీ నందిగం, సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: జయకృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

