పార్లమెంట్ సమావేశాలపై జాప్యమెందుకు?
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసి 100 రోజులు గడిచినా మోదీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల ఊసెత్తకపోవడాన్ని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు శీతాకాల సమావేశాలు ఉంటాయా? ఉండవా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌తో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఘర్షణ కొనసాగుతున్న వేళ, పార్లమెంట్ శీతాకాల సమావేశాన్ని నిర్వహించడంలో జాప్యంపై విపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
- డీలిమిటేషన్ వివాదం నేపథ్యంలో కేంద్రానికి విపక్షాల ప్రశ్న
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నిర్వహణపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసి 100 రోజులు గడిచినా మోదీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల ఊసెత్తకపోవడాన్ని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు శీతాకాల సమావేశాలు ఉంటాయా? ఉండవా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌తో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఘర్షణ కొనసాగుతున్న వేళ, పార్లమెంట్ శీతాకాల సమావేశాన్ని నిర్వహించడంలో జాప్యంపై విపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చరిత్రలో నాలుగుసార్లే జరగలేదు.
ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే, సమావేశాలను అధికారికంగా ముగించినట్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. అప్పటి నుంచి 100 రోజులకు పైగా గడిచాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వచ్చే సమావేశాలను 2027 ఫిబ్రవరి 12లోపు ప్రభుత్వం నిర్వహించాలి. సమావేశాలను అధికారికంగా ముగించకపోవడంతో, డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయడానికి స్వల్ప వ్యవధి నోటీసుతో ప్రత్యేక సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉన్నదని ఇటీవల కొన్ని వార్తాసంస్థలు తెలిపాయి. అయితే దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. శీతాకాల సమావేశాలపై ప్రభుత్వ వైఖరి కోసం ఎదురుచూస్తున్నారు.
ఇంకా ఎందుకు నిర్వహించడం లేదు?
కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎందుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిర్వహించడం లేదని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మంగళవారం ప్రశ్నించారు. పార్లమెంట్‌ను ఇకనైనా నిర్వహిస్తున్నారా? అని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఎక్స్‌లో పోస్టు చేసి, స్పీకర్ ఓం బిర్లాను ట్యాగ్ చేశారు. టీఎంసీ మాజీ ఎంపీ సాకేత్ గోఖలే మాట్లాడుతూ ఈ ఏడాది మొదట్లో పార్లమెంట్లో ప్రభుత్వానికి అపజయం ఎదురైన తర్వాత హోం మంత్రి అమిత్ షా నిరాశలో ఉన్నారని అన్నారు.
డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ బీజేపీ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తమ పార్టీ ఎంపీలకే సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. శీతాకాల సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారో, అసలు అది జరుగుతుందో లేదో ఎవరికీ తెలియదని ఆమె అన్నారు. ‘మన కళ్ల ముందే మోదీ-షా పాలన కుప్పకూలుతున్నది’ అని ఆమె అన్నారు. టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఎక్స్‌లో పాత వీడియోను పంచుకుంటూ, ‘ఆందోళనలో ఉన్న బీజేపీ’ శీతాకాల సమావేశాన్ని ఐచ్ఛిక కార్యక్రమంగా ఎందుకు చూస్తున్నదని ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

