పాకిస్థానీ వెబ్‌సిరీస్‌ను అడ్డుకోవాలి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో పాకిస్థానీ కళాకారుల సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రదర్శన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో పాకిస్థానీ కళాకారుల సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ప్రదర్శన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్న పాకిస్థానీ వెబ్‌సిరీస్ ‘జో బచాయ్ హై సంగ్’పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్‌ను భారతదేశంలో నిలిపివేయాలని కోరుతూ ఆల్ ఇండియన్ సినీ వర్క్‌ర్స్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఓ లేఖ రాసింది.
భారత్‌లో పాకిస్థానీ సినిమాలు, వెబ్‌సిరీస్ కంటెంట్‌ను శాశ్వతంగా నిషేధించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుసురావాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఫర్షత్ ఇష్తియాక్ రాసిన ప్రజాదరణ పొందిన ఉర్దూ నవల ‘జో బచాయ్ హై సంగ్ సమేట్లో’ ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. ఇందులో ఫవాద్‌ఖాన్, మహీరాఖాన్, హానియా అమీర్ తదితరులు నటించారు. ఈ సిరీస్‌ను భారత్‌లో నిషేధించడంతో పాటు పాకిస్థానీ కంటెంట్‌ను ఇండియాలో ప్రసారం చేసే విషయంలో నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఇతర ఓటీటీ సంస్థలు తమ వైఖరిని తెలియజేయాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

