తెలంగాణ ద్రోహి రేవంత్.. సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ కౌంటర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ అబద్ధాల వరద పారించాడని, బీఆర్ఎస్పై బురద జల్లేందుకు విఫలయత్నం చేశాడని, నీళ్లెత్తుమంటే దుమ్మెత్తి పోస్తున్నాడని, మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టి అతి తెలివితేటలు ప్రదర్శించాడని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
- ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాల కంపు
- పాలమూరు ఎత్తిపోతలను ఎండబెట్టి.. కుప్పానికి నీళ్లు పంపిన వంచకుడివి
- ఉన్న నీళ్లెత్త చేతగాక మా మీద నిందలా?
- అసంబద్ధ లెక్కలతో జ్యాదా హుషారీ
- తెలంగాణ కోసమే పుట్టింది బీఆర్ఎస్
- ప్రాణాలకు తెగించి కొట్లాడింది కేసీఆర్
- కేసీఆర్ బయల్దేరితేనే సాగర్ ఎడమ కాలువ నిర్వహణ బాధ్యత ప్రభుత్వం తీసుకున్నది
- రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ట్రిబ్యునల్ వేయాలని కోరిండ్రు
- గులాబీ జెండా ఎగిరిన తర్వాతే తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడదాకా నీళ్లువచ్చినయ్
- నాడు ఎంగిలిమెతుకులకు ఆశపడి నోర్లు మూసుకున్నది మీ కాంగ్రెస్ మంత్రులే
- నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు
- ఆధారాలతో సీఎం అబద్ధాలు పటాపంచలు
బీఆర్ఎస్ ఉన్నప్పుడే 2022లోనే పల్నాడు స్కీమ్ జీవో 56 వచ్చిందని రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం పూర్తి అబద్ధం. ఆ జీవోలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామనే ప్రతిపాదన, ప్రస్తావనా ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే అది బయటపెట్టాలి.
-హరీశ్‌రావు
కేసీఆర్‌తోనే న్యాయం
ఉద్యమనేత కేసీఆర్ బయల్దేరితేనే అప్పుడు నాగార్జున సాగర్ కుడికాలువ లెక్కనే ఎడమ కాలువ నిర్వహణప్రభుత్వ నిధులతోనే చేపడుతామనే జీవో ఇచ్చిండ్రు.
జూరాలను కట్టి మూలకు పెట్టిండ్రని కేసీఆర్ నిలదీశాక, గులాబీ జెండా ఎత్తిన తరువాతే కర్ణాటకకు పరుగులు పెట్టి పరిహారం డబ్బులు కట్టిండ్రు. అప్పటివరకు జూరాల కింద పది వేల ఎకరాలకు కూడా నీళ్లు రాలే..
కేసీఆర్ పోరాటం వల్లే మెదక్ జిల్లాకు ఆయకట్టు వచ్చింది. గులాబీ జెండా ఎత్తిన తర్వాతే సింగూరు నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు జీవో జారీ అయ్యింది.

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ కింద 5 లక్షల ఎకరాలు కూడా పారలే. కేసీఆర్ వచ్చాక 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిండ్రు. నాడు ఎస్సారెస్పీ స్టేజీ 2లో తుమ్మలు మొలిస్తే.. గులాబీ జెండా ఎగిరిన తర్వాతే ఉత్తమ్ సొంత జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు గోదావరి నీళ్లు వచ్చినయ్.
తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 42 రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసి సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయాలని విన్నవిచ్చిండ్రు. కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసి 299 కాకుం డా మరో 581 టీఎంసీలు తెలంగాణకు కృష్ణాలో అవసరమని కోరిండ్రు. ఆ తర్వాత కూడా 66:34 నిష్పత్తిలో కాకుండా 50ః50 నిష్పత్తిలో వాడుకుంటామని 30కి పైగా లేఖలు రాసిండు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని తెలిసే ఫ్రష్ర్టేషన్లో రేవంత్‌రెడ్డి బురద రాజకీయాలకు పాల్పడుతున్నడు. బీఆర్ఎస్ను ఎదుర్కోలేక కుట్రలు, అసత్య ప్రచారాలకు తెరతీసిండు. నిద్రలో కూడా కేసీఆర్‌నే కలువరిస్తున్నడు. రేవంత్ ఎన్ని కుట్రలు చేసినా మేము తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటం. మా అధినేత కేసీఆర్ అన్నీ గమనిస్తున్నరు. ఎప్పుడు రావాలో అప్పుడు బయటకు వస్తరు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతరు.
-హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ అబద్ధాల వరద పారించాడని, బీఆర్ఎస్పై బురద జల్లేందుకు విఫలయత్నం చేశాడని, నీళ్లెత్తుమంటే దుమ్మెత్తి పోస్తున్నాడని, మోకాలుకు బోడిగుండుకు ముడిపెట్టి అతి తెలివితేటలు ప్రదర్శించాడని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ‘మేం నీళ్ల లెకలు అడుగుతుంటే కల్లు తాగిన కోతి లెక మాట్లాడుతున్నవ్. ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తున్నది నీకు రేవంత్‌రెడ్డీ? చంద్రబాబు దాసుడు ఆదిత్యానాథ్ దాసును పకన పెట్టుకొని మాట్లాడుతున్నవ్. నాడైనా నేడైనా తెలంగాణ ద్రోహివి నువ్వే. ఉరితీయాల్సింది నిన్ను.. మంత్రి ఉత్తమ్‌ను’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీ ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులతో కలిసి హరీశ్ మంగళవారం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. నీళ్ల విషయంలో రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు.
కేసీఆర్ నిలదీస్తేనే కాంగ్రెస్ పరుగులు
జూరాలను కట్టి మూలకు పెట్టారని కేసీఆర్ నిలదీశాక, గులాబీ జెండా ఎత్తిన తరువాతనే కర్ణాటకకు పరుగులు పెట్టి పరిహారం డబ్బులు కట్టారని హరీశ్ వివరించారు. ‘కేసీఆర్ పోరా టం వల్లే మెదక్ జిల్లాకు ఆయకట్టు వచ్చింది. గులాబీ జెండా ఎత్తిన తర్వాతే సింగూరు నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు జీవో ఇచ్చిండ్రు. ఎస్సారెస్పీ కింద 5 లక్షల ఎకరాలు పారలేదు. కేసీఆర్ 9 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిండ్రు. ఎస్సారెస్పీ స్టేజీ 2లో తుమ్మలు మొలిచినయ్. ఉత్తమ్ సొంత జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకు కూడా గులాబీ జెండా ఎగిరిన తర్వాతే నీళ్లు వచ్చినయ్. ఉమ్మ డి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఎస్సారెస్పీ నుం చి ధవళేశ్వరం వరకు గోదావరి మీద ఒక ఆనకట్ట కట్టిండ్రా? చుక నీైళ్లెనా తెచ్చిండ్రా? ఎల్లంపల్లిని పూర్తి చేసింది.. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల, సమ్మకసాగర్, సీతమ్మసాగర్‌ను కట్టింది కేసీఆరే’ అని పునరుద్ఘాటించారు.
299 టీఎంసీల పాపం కాంగ్రెస్‌దే
‘కృష్ణాలో 299 టీఎంసీల వాటా తెచ్చింది రేవంత్ పకన కూర్చున్న కాంగ్రెస్ పాపాత్ములే. 299:512 టీఎంసీలకు కర్త, కర్మ, క్రియ కాంగ్రెస్ పార్టీయే’ అని హరీశ్ వివరిం చారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పాలకులు కృష్ణా జాలాల్లో తెలంగాణను 299కి పరిమితం చేసిండ్రు. విభజన బిల్లులో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ వచ్చి న తర్వాత ఇరు రాష్ర్టాలు వర్కింగ్ అరెంజ్మెంట్ కోసం 2015లో చేసుకున్న ఒప్పందానికి మూలం కాంగ్రెస్ పెట్టిన డాక్యుమెంటే. ఆ ఒప్పందం కూడా శాశ్వతం కాదు. ఏడాదికే పరిమితం. ట్రిబ్యునల్ ముందుగానీ, కోర్టు ఆర్డర్ల ముందుగానీ చెల్లదని, తాత్కాలికమని అందులోనే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం 42 రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయాలని కంప్లయింట్ ఇచ్చిండ్రు.
కృష్ణాలో తెలంగాణకు జరుగుతున్న నష్టం, న్యాయమైన వాటా గురించి పట్టుబట్టిండ్రు. కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిసి 299 కాకుండా మరో 581 టీఎంసీలు తెలంగాణకు కృష్ణాలో అవసరమున్నదని కోరిండ్రు. ఆ తర్వాత కూడా 66:34 నిష్పత్తిలో కాకుండా 50ః50 నిష్పత్తిలో వాడుకుంటామని 30కి పైగా లేఖలు రాసిండ్రు. కేఆర్ఎంబీ, అపెక్స్ మీటింగ్‌ల్లో అడిగిండ్రు. అయినా కేసీఆరే 299 టీఎంసీలకు శాశ్వతంగా ఒప్పుకొన్నారని రేవంత్‌రెడ్డి అంటున్నడు. మరి శాశ్వతంగా రాసిస్తే ట్రిబ్యునల్‌ను వేయాలని అడగడమేగాక కేసీఆర్ ఎందుకు సాధిస్తారు? 50ః50 శాతం వాటా కోసం 2018 నుంచే ఎందుకు పట్టుబడుతరు? వరుసగా లేఖలు ఎందుకు రాస్తారు?’ అని హరీశ్ నిలదీశారు. రేవంత్‌రెడ్డి 2025లో అదే 299 : 512 తాతాలిక ఒప్పందానికి ఎందుకు ఒప్పుకొని వచ్చాడని ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి మరణశాసనం రాసినట్టేనని మేం అనలేమా?’ అని తెలిపారు.
పల్నాడు వాటర్ గ్రిడ్ పనులకు ఏపీ ప్రభుత్వం జనవరిలోనే టెండర్లు పిలిచింది. సాగర్ నుంచి 1.86 టీఎంసీలు కేటాయిస్తూ 453 జీవోను ఆగస్టులో విడుదల చేసింది. అయినా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సోయిలేదు. అదే జిల్లాకు చెందిన నీళ్ల మంత్రికి సోయి లేదు. పత్రికల్లో వార్తలు వచ్చాక, మా నాయకుడు కేటీఆర్ బయటపెట్టిన తర్వాత బ్యాక్‌డేట్‌తో లెటర్ రాసి తప్పించుకున్నవు.
-హరీశ్‌రావు
ఉరి వేయాల్సింది రేవంత్‌కే
‘సాగర్‌కు పొక్క కొడుతున్నా, కుప్పం వరకు ఏపీ నీళ్లను తరలించుకుపోతున్నా, ట్రిబ్యునల్ వాదనల్లో కాలయాపన జరుగుతున్నా కుంభకర్ణ నిద్రపోతున్న రేవంత్‌రెడ్డిని, ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఉరి వేయాలి’ అని హరీశ్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు తాము సిద్ధమని, మైకులు కట్ చేయకుండా ఉండేందుకు సిద్ధమా? అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.

పాలమూరును పచ్చగ చేసింది కేసీఆరే
30 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరుకు 30 వేల ఎకరాలకు నీళ్లిస్తే కేసీఆర్ 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చారని హరీశ్ గుర్తుచేశారు. 4 వేల కోట్లు ఖర్చు పెట్టి, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు తదితర పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని వెల్లడించారు. రేవంత్ సీఎం అయ్యాక గురువు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల కోసం 2024 డిసెంబర్ 3న చంద్రబాబు ప్రభుత్వం జీవో 403, 405ను జారీ చేస్తే రేవంత్‌రెడ్డి ఇప్పటికీ నోరుమెదపలేదని, గురుదక్షిణలో భాగమని తెలిపారు.
ఆ లైనింగ్ ఫలితంగానే 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు కృష్ణా జలాలు ఈ ఏడాది తరలిపోయాయని, పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం రేవంత్‌రెడ్డి నీళ్లివ్వలేదని నిప్పులు చెరిగారు. చిత్తశుద్ధి ఉంటే లైనింగ్ పనులు ఎందుకు ఆపలేదని నిలదీశారు. పాలమూరు లిఫ్ట్ పథకం పనులను బీఆర్ఎస్ హయాంలోనే 75 శాతానికి పైగా పూర్తిచేశామని, ప్యాకేజీ 3లో రెండు మూడు కిలోమీటర్లు కాలువలు తవ్వితే 50 టీఎంసీలు ఎత్తిపోయవవ్చని, కానీ ఆ పనులను మూడేండ్లుగా రేవంత్‌రెడ్డి పూర్తిచేయలేదని, కాలువల టెండర్లను రద్దు చేశాడని నిప్పులు చెరిగారు.
పల్నాడుపై అడ్డంగా దొరికి బుకాయింపా
బీఆర్ఎస్ ఉన్నప్పుడే 2022 లోనే పల్నా డు స్కీమ్ జీవో 56 వచ్చిందని రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారం పూర్తి అబద్ధమని హరీశ్ తేల్చిచెప్పారు. ఆ జీవోలో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామనే ప్రతిపాదన, ప్రస్తావనా ఎక్కడా లేదని వెల్లడించారు. ఒకవేళ ఉంటే అది బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చాకనే జీవో 453జీవో వచ్చిందని, అందులోనే స్పష్టంగా సాగర్ నుంచి పొకకొట్టి నీళ్లు తీసుకుపోతామని ఉన్నదని తేల్చిచెప్పారు.
ఇంత జరుగుతున్నా పల్నాడును అడ్డుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడా ఎందుకు చెప్పలేదని నిలదీశారు. కేఆర్ఎంబీ మీటింగ్‌లోనూ చర్చించలేదని, ఏపీ ఇంజినీర్లే ఈ విషయాన్ని వెల్లడించారని వివరించారు. రేవంత్ చెప్పడం వల్లే తెలంగాణ ఇంజినీర్లు నోరు మూసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో 483లోనూ సాగర్ నుంచి జలాలను తీసుకుపోతామని లేదని చెప్పారు. పల్నాడు వాటర్‌గ్రిడ్‌లో సీఎం అడ్డంగా దొరికి తప్పించుకొనేందుకు అనేక తిప్పలు పడుతున్నాడని, అబద్ధాల్లో రేవంత్‌రెడ్డికి ఆసార్ అవార్డు ఇవ్వాలని చురకలంటించారు.
రాయలసీమను ఆపించిందే కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో కేసులు వేసి గతంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేయించింది తప్ప, రేవంత్ ఆపలేదని చంద్రబాబే చెప్పారని హరీశ్ వివరించారు. కేసీఆర్‌ను కలిసిన అనంతరమే రాయలసీమ పనులకు జగన్ మే 5, 2020లో జీవో ఇచ్చారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు పూర్తి అబద్ధమని తేల్చిచెప్పారు. అసలు ఆ జీవో రాకముందే, 4 నెలల ముందుగానే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా లిఫ్ట్‌ను చేపట్టవద్దని 2020 జనవరిలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి, కేఆర్ఎంబీకి, ఏపీకి లేఖ రాసిందని, జీవో వచ్చిన వారంలో మళ్లీ కేంద్రానికి లేఖ రాసిందని గుర్తుచేశారు.
ప్రాజెక్టు పనులను నిలుపుదల చేయించాలని ఒత్తిడి చేసి కేఆర్ఎంబీతో ఏపీకి ఆదేశాలు జారీ చేయించామని, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోనూ చేర్పించడమేకాదు, లిఫ్ట్‌పై మొండిగా ముందుకువెళ్తే అలంపూర్ వద్ద బరాజ్ నిర్మిస్తామని కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సమక్షంలోనే జగన్ ముఖం మీదే నా డు కేసీఆర్ తేల్చిచెప్పారని, ఆ తర్వాత జోగులాంబ బరాజ్‌కు జీవో కూడా ఇచ్చారని వివరించారు. రాయలసీమ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ 19 ఉత్తరాలు రాసిందని, ఇది కేసీఆర్ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
మేం మంత్రులమైంది కేసీఆర్ వల్లే
పోతిరెడ్డిపాడు లిఫ్ట్‌కు సంబంధించి కూడా రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీశ్ మండిపడ్డారు. ‘మేం మంత్రులమైనమంటే అది కేసీఆర్ భిక్ష. వైఎస్ ఎవరు? కేసీఆర్ ఆదేశాలతోనే మంత్రి పదవులను గడ్డిపోచలుగా విసిరిపారేసినం. రాజీనామాలు చేసినం. ఆ తర్వాతనే పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అయినా రేవంత్‌రెడ్డి అది బడ్జెట్ గ్రాంట్స్‌లో ఉన్నదంటడు. మూడేండ్లలో ముఖ్యమంత్రికి కనీసం బడ్జెట్ గురించి, పద్దుల గురించి అవగాహన రాలేదు. వాస్తవమేందంటే క్యాబినెట్‌కు పద్దులు రానేరావు. అసలు ఎంగిలి మెతుకులకు ఆశపడ్డది కాంగ్రెస్ నాయకులు.
పోతిరెడ్డిపాడుపై అపోహలు వద్దని కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వ్యాసాలు రాసిండు. పోతిరెడ్డిపాడు కోసం మేం పదవులు వదులుకుంటే మీరు మంత్రులైండ్రు. 26 మంది ఎమ్మెల్యేలం 42 రోజుల పాటు అసెంబ్లీని స్తంభింపజేసినం. 2005లో పోతిరెడ్డిపాడు మీద అడ్జర్న్ మోషన్ ఇచ్చినం. అసెంబ్లీ మినిట్స్‌లో ఉన్నయ్. జీవో 170 రద్దు చేయాలని పోతిరెడ్డిపాడుపై చర్చ జరుగాలని పట్టుబట్టినం. పోడియం వద్ద నినాదాలు చేసినం. కానీ ఆరోజు ఇదే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్, కోమటి, దామోదర, చిన్నారెడ్డి నోర్లు మూసుకొని ఉన్నరు. పదవుల కోసం పెదవులు మూ సుకున్నది కాంగ్రెస్సే. ఆ రోజు హంద్రీనీవాకు హరతులు పట్టింది కాంగ్రెస్‌లో మంత్రిగా ఉ న్న డీకే ఆరుణ. ఇప్పుడు రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్తున్నడు’ అంటూ తుర్పారబట్టారు.
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే చందంగా సొంత జిల్లా పాలమూరుకే రేవంత్‌రెడ్డి ద్రోహం చేసిండు. పాలమూరు లిఫ్ట్ పథకంలో 75 శాతానికి పైగా పనులు పూర్తి చేసినం. ప్యాకేజీ 3లో రెండు మూడు కిలోమీటర్ల కాలువ తవ్వితే 50 టీఎంసీలు లిఫ్ట్ చేయవచ్చు. కానీ ఆ పనులను రేవంత్‌రెడ్డి మూడేండ్లుగా పూర్తచేయలేదు. కాలువల టెండర్లు రద్దు చేసిండు. నాడు ఉద్యమ సమయంలో, నేడు ముఖ్యమంత్రిగా తెలంగాణకు రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నడు.
-హరీశ్‌రావు
రేవంత్ జ్యాదా హుషార్
రేవంత్‌రెడ్డి జ్యాదా హుషార్ అని హరీశ్ ఎద్దేవాచేశారు. ‘కృష్ణా నీటిని ఎంత వాడామో చెప్తున్నరు..కానీ ఏపీ ఎన్ని మళ్లించుకుపోయింది? ఎన్ని నీళ్లు వచ్చాయనేది చెప్పడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు’ అని ధ్వజమెత్తారు. 2024-25లో ఏపీ 718, తెలంగాణ 286 టీఎంసీలను వినియోగించిందని, తెలంగాణది 28 శాతమని, 2025-26 ఏపీ 771, తెలంగాణ 267 టీఎంసీలు వాడ గా తెలంగాణది 25 శాతమేనని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇది అత్యంత కనిష్ఠ జలాల వినియోగమని విమర్శించారు. ‘20 లక్షల ఎకరాలకు నీళ్లిస్తానని అసెంబ్లీలో పద్దు లు పాస్ చేసినవ్.. వాటిలో కనీసం 5 శాతమైనా ఇచ్చావా రేవంత్‌రెడ్డీ?’ అని నిలదీశారు. ‘ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇచ్చినవ్? ఎక్కడ ఇచ్చినవో శ్వేతపత్రం విడుదల చెయ్యి.. లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పు’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ 47 లక్షల ఎకరాల కు సాగునీళ్లు ఇస్తే కాంగ్రెస్ పదేండ్ల పాలనలో 6.64 లక్షల ఎకరాలకే ఇచ్చిందని గుర్తుచేశారు.
ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్..
‘నీళ్లు ఎత్తం.. అన్నారం, సుందిళ్ల కూలితే భద్రాచలం కొట్టుకుపోతది’ అని మాట్లాడిండ్రు.. ఇప్పుడేమో మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తకుంటే ఏమైంది.. కింద దేవాదుల, సీతమ్మసాగర్ ఉన్నయ్ అని రేవంత్‌రెడ్డి అంటున్నడు’ అని హరీశ్ విమర్శించారు. గ్రావిటీ ద్వారా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావని రేవంత్ చావు కబురు చల్లగా చెప్పిండని, గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు మాట మార్చినందుకు చెంపలు వేసుకొని రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు బీఆర్ఎస్తోనే పోటీ అని ఇటీవల ఓ కాంక్లేవ్‌లో రేవంత్‌రెడ్డి చెప్పిండని, మరోవైపు ఎమ్మెల్యేలే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అర్థమయ్యే ఎదుర్కోలేక కుట్రలు, అసత్య ప్రచారాలకు రేవంత్ తెరతీశాడని మండిపడ్డారు. నిద్రలో కూడా కేసీఆర్‌నే కలువరిస్తున్నాడని, రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెడితే కేసీఆర్ పేరు 50 సార్లు ఉంటదని, బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, అందుకే ఫ్రష్ర్టేషన్లో బురద రాజకీయాలకు పాల్పడుతున్నాడని వివరించారు. రేవంత్‌రెడ్డి చేసే అసత్య ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదని, తెలంగాణకు ద్రోహం చేయవద్దని మీడియాకు హరీశ్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ పాదయాత్ర చేస్తేనే కదా జీవో వచ్చింది?
ఒకే ప్రాజెక్టు, ఒకే ప్రభుత్వంలోనే ఉమ్మడి పాలకులు తెలంగాణపై ఎంతో వివక్ష చూపారని హరీశ్ నిప్పులు చెరిగారు. ఏపీకి సాగునీటిని అందించే నాగార్జునసాగర్ కుడికాలువ నిర్వహణకు ప్రభుత్వం నిధులు వెచ్చిస్తే, తెలంగాణ ఆయకట్టకు నీరందించే ఎడమ కాలువను మాత్రం ఇక్కడి రైతులే స్వతహాగా నిర్వహించుకోవాలని ఉమ్మడి పాలకులు వివక్ష చూపారని వివరించారు. అయినా నాడు కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న ఉత్తమ్, కోమటిరెడ్డి ఎవరైనా మాట్లాడారా? అని నిలదీశారు. హాలియా నుంచి బయల్దేరి పాదయాత్ర చేస్తమని ఉద్యమనేత కేసీఆర్ బయల్దేరితే అప్పుడు కుడికాలువ లెక్కనే ఎడమ కాలువ నిర్వహణను ప్రభుత్వ నిధులతోనే చేపడుతామనే జీవో ఇచ్చారని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- harish rao
- KCR
- Revanth Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

