Mallika Sherawat | కరణ్ జోహర్ హోస్ట్‌గా ‘ది ట్రేటర్స్ సీజన్ 2’ రియాలిటీ షోలో 20 మంది కంటెస్టెంటు (Contestants)లు పాల్గొంటున్నారు. దీనిలో ఒక కంటెస్టెంట్‌గా బాలీవుడ్ సినీ తార మల్లికా షెరావత్‌ను తీసుకున్నారు. ఆ 20 మందిలో మల్లికకే ఎక్కువ పారితోషికం ఇస్తున్నట్లు వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా మారాయి. దీంతో ఈ వార్తలు నిజమేనని ఆమె నవ్వుతూ ఒప్పుకొన్నారు. బిగ్‌బాస్, ఖత్రోంకే ఖిలాడీ వంటి షోలలో ఆఫర్లు వచ్చినా తిరస్కరించాను. ది ట్రేటర్స్ 2 చాలా ఆసక్తిని కలిగించిన మొదటి రియాలిటీ షో అని, అందుకే దీనిలో పాల్గొనడానికి ఒప్పుకొన్నానని ఆమె అన్నారు.
క్షమాపణులు ఎందుకు చెప్పాలి
ఈ షోలో పాల్గొంటున్నందుకు మల్లిక ఎంత తీసుకుంటున్నారో చెప్పలేదు. కానీ సుమారు రూ. 7 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. స్వతంత్రంగా ఉన్నప్పుడు ఎవరికైనా డబ్బు (Money) చాలా ముఖ్యం. మనం జీవించడానికి అవసరమైనవి ఫ్రీగా రావు. వాటి కోసం డబ్బులు చెల్లించాలి. అలాంటప్పుడు డబ్బులు సంపాదించినందుకు సారీ ఎందుకు చెప్పాలి అని ఆమె బదులిచ్చారు. తన విలువను తాను తెలుసుకునేందుకు ఎప్పుడూ నమ్ముతాను. అన్యాయంగా అత్యధికంగా డబ్బు ఇచ్చే ఏ పనిని ఒప్పుకోను అని తెలిపారు. తాను స్వయంకృషితో ఎదిగిన మహిళను. కాబట్టి నాకు నచ్చిన పని చేస్తాను. నేను సంపాదించిన డబ్బుతో లగ్జరీ వస్తువులను కొనుక్కోవడం ఇష్టమని పేర్కొన్నారు.
ట్రేటర్స్ నచ్చడానికి కారణం
ఇతర రియాలిటీ షోలు నాకు నచ్చలేదు. కానీ ఈ ట్రేటర్స్లో సైకాలజికల్, స్ట్రాటజీ డ్రైవెన్ ఫార్మాట్ చాలా నచ్చింది. దీనిలో నటించడానికి మొదటల్లో సంకోచించాను. నా మేనేజర్ చెప్పడంతో ట్రేటర్స్ మొదటి సీజన్ చూశాను. ఈ షోలో ఒక వ్యక్తి ముసుగు (Mask) వెనుక దాక్కొంటారు. మిగిలిన ఆటగాళ్లు ఆ ముసుగు వెనుక ఉన్న వ్యక్తిని గమనించాలి. దీనిలో గెలవాలని, అందరి దృష్టిలో పడాలనే తపనతో నిజ జీవితంలో చేయని పనులను ఈ షో చేయిస్తుంది. ఈ షో అందరిని ఒక ఆట ఆడిస్తుందనడంలో సందేహం లేదు. అందుకే ఈ షోలో ఆడేందుకు ఒప్పుకొన్నాని అన్నారు.
సరైన జీవిత భాగస్వామి దొరకలేదు
‘ది బ్యాచిలరేట్ ఇండియా: మేరే ఖయాలోంకి మల్లిక’ అనే డేటింగ్ షోలో మల్లిక పాల్గొన్నారు. దీనిలో పాల్గొన్నప్పటికీ సరైన జీవిత భాగస్వామి దొరకలేదు. అయినప్పటికీ నాకేం బాధ లేదని ఆమె వెల్లడించారు. ఆ షో ద్వారా వచ్చిన రెమ్మునరేషన్తో రెండు ఇండ్లు కొన్నాను. ఆ ఇండ్ల ద్వారా అద్దె కూడా వస్తుంది.
ది ట్రేటర్స్ మొదటి సీజన్లో ఉర్ఫీ జావేద్, నికితా లూథర్ సంయుక్తంగా విజేతలుగా నిలిచారు. సీజన్ 2లో 20 మంది కొత్త కంటెస్టెంట్లను తీసుకున్నారు. ఈ షో ఆగస్టు 13న ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్నది.