లక్నో: బురఖా ధరించిన మహిళ ఒక జ్యుయలరీ షాపులోకి వచ్చింది. బంగారు ఆభరణాల కొనుగోలు పేరుతో వాటిని పరిశీలించింది. ఉన్నట్టుండి గన్ గురిపెట్టింది. ట్రేలో ఉన్న బంగారు నగలు తీసుకుని పారిపోయింది. (Burqa-Clad Woman Robs Jewellery ) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రుదౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అగర్వాల్ కాంప్లెక్స్‌లో ఉన్న జ్యుయలరీ షాపులోకి బురఖా ధరించిన ఒక మహిళ వచ్చింది. కొన్ని నగలను పరిశీలించింది. ఆ తర్వాత అకస్మాత్తుగా తుపాకీ చూపించింది. ట్రేలో ఉన్న బంగారు నగలు తీసుకుని పారిపోయింది.
కాగా, ఇది చూసి జ్యుయలరీ షాపు యజమాని షాక్ అయ్యాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జ్యుయలరీ షాపులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
మరోవైపు నిందితురాలిని గుర్తించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆమెను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఆ మహిళ వినియోగించిన పిస్టల్ నకిలీ కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జ్యుయలరీ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी: बुर्कानशी महिला ज्वैलर्स की शॉप में घुसी। महिला ने काउंटर से सोने का हार उठाया। कारोबारी कुछ समझ पाता तमंचा दिखा कर बुर्कानशी महिला 26 ग्राम का हार लेकर भाग निकली। अयोध्या के रुदौली के कोठी मौहल्ला की घटना। pic.twitter.com/QUmazJD0pT
— Shahnawaz (News 24) (@Shahnawazreport) April 2, 2026
Also Read:
Son stabs mother’s friend | తల్లితో సంబంధంపై అనుమానం.. కత్తితో పొడిచి వ్యక్తిని చంపిన ఆమె కుమారుడు
Khushbaz Jattana | ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కాంగ్రెస్ నేత, ఆయన డ్రైవర్ మృతి
Watch: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?