అహ్మదాబాద్: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు దాడి చేసింది. రోడ్డుపై పడిన అతడ్ని కొమ్ములతో కుమ్మేసింది. గమనించిన స్థానికులు సహాయం కోసం ముందుకు వచ్చారు. ఆ ఎద్దును అతికష్టం మీద తరిమారు. ఆ వ్యక్తిని రక్షించారు. (Bull attacks Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 30న వెరావల్లోని ఇరుకైన రోడ్డులో ఒక వ్యక్తి స్కూటీపై వెళ్తున్నాడు. ఆ వీధిలో ఉన్న ఎద్దు అతడిపై దాడి చేసింది. రోడ్డుపై పడిన ఆ వ్యక్తి ఎద్దును ప్రతిఘటించేందుకు ప్రయత్నించాడు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. అయితే సాధ్యం కాకపోవడంతో రోడ్డుపై ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో ఎద్దు అతడ్ని కుమ్మేసింది.
కాగా, గమనించిన స్థానికులు సహాయం కోసం ముందుకు వచ్చారు. రాళ్లు విసురుతూ, కర్రలతో కొడుతూ ఎద్దును తరిమేందుకు ప్రయత్నించారు. అతికష్టం మీద దానిని దూరంగా వెళ్లగొట్టారు. ఆ ఎద్దు దాడి నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. తల, ఛాతి, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలైన అతడ్ని ఆటోలో సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Rajkot, Gujarat – A horrifying incident of a stray animal attack was captured on CCTV in Shivnagar area of Veraval village in Rajkot district, where a young man on a moped was brutally crushed and injured by aggressive stray cattle. pic.twitter.com/B4Puywgju5
— NextMinute News (@nextminutenews7) April 2, 2026
Also Read:
Khushbaz Jattana | ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కాంగ్రెస్ నేత, ఆయన డ్రైవర్ మృతి
Guests Assault Bride, Groom | పెళ్లిలో మద్యం ఇవ్వలేదని.. వధూవరులపై అతిథుల దాడి
Watch: ఒక ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళలు ఏం చేశారంటే?