లక్నో: ఒక ఇంట్లోకి వ్యక్తి ప్రవేశించాడు. దొంగతనం కోసం ప్రయత్నించాడు. ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ వ్యక్తిని గమనించారు. మెల్లగా అతడ్ని చుట్టుముట్టారు. ఆ వ్యక్తిని పట్టుకుని కొట్టారు. (Women Corner, Beat Up Man) సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చ్ 21న ఈద్ రోజున ఒక డాక్టర్ కుటుంబానికి చెందిన మహిళలు వారి ఇంట్లో భోజనం చేస్తున్నారు.
కాగా, ఒక వ్యక్తి మెల్లగా ఆ డాక్టర్ ఇంట్లోకి చొరబడ్డాడు. చోరీ కోసం ప్రయత్నించాడు. ఆ కుటుంబంలోని ఏడుగురు మహిళలు ఆ వ్యక్తిని గమనించారు. భోజనం మధ్యలోనే వారు లేచారు. అతడ్ని చుట్టుముట్టి కొట్టారు. కొందరు మహిళలు అతడు తప్పించుకోకుండా డోర్ లాక్ చేశారు. అలాగే తమ వారికి ఫోన్ చేశారు.
అయితే ఆ మహిళలతో పెనుగులాడిన ఆ వ్యక్తి చివరకు వారి నుంచి తప్పించుకున్నాడు. ఆ ఇంటి నుంచి పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A goon broke into the home of a doctor in Moradabad. The girls in the house overpowered him and gave him a thorough beating. This video of the girls’ bravery is said to be from March 21.
pic.twitter.com/CKLjvq1DXi— Ghar Ke Kalesh (@gharkekalesh) April 2, 2026
Also Read:
Woman sacrificed daughter | కుమారుడి ఆరోగ్యం కోసం.. కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లి
Watch: హైకోర్టు ముందు వాహనాలకు నిప్పంటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఆహారం పెట్టిన వృద్ధురాలు మృతి.. భావోద్వేగంతో విలపించిన కోతి