బెంగళూరు: చాలా కాలంగా కోతులకు ఆహారం పెడుతున్న వృద్ధురాలు మరణించింది. అయితే ఆమె మరణాన్ని ఒక కోతి తట్టుకోలేకపోయింది. వృద్ధురాలి మృతదేహం వద్ద అది విలపించింది. ఆమె ముఖంపై తల ఉంచి భావోద్వేగం చెందింది. (Monkey Mourns) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాయర దొడ్డికి చెందిన 85 ఏళ్ల పార్వతమ్మ కొంతకాలంగా కోతులకు ఆహారం పెడుతున్నది. కోతుల సమస్యపై పొరుగువారు ఆరోపణలు చేసినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. కోతులకు ఆహారం ఇవ్వంతో పాటు వాటితో ప్రేమగా మెలిగేది.
కాగా, మార్చి 30న వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా పార్వతమ్మ మరణించింది. అయితే కొన్ని కోతులు యథావిధిగా ఆమె పెట్టే ఆహారం కోసం అక్కడకు వచ్చాయి. ఇంటి బయట ఉంచిన పార్వతమ్మ మృతదేహాన్ని చూసి ఒక కోతి చలించిపోయింది. ఆమె వద్దకు వెళ్లి కౌగిలించుకుని విలపించింది. పార్వతమ్మ ముఖంపై తల ఉంచి భావోద్వేగం చెందింది.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు స్పందించారు. మనిషి, కోతి మధ్య ఉన్న అసాధారణ బంధానికి ఇది నిదర్శనమని ఒకరు కొనియాడారు. ‘ఆ కోతి ఆమెను కౌగిలించుకుని విలపించిన తీరు, చూపిన ప్రేమ మాటలకు, జాతులకు అతీతమైనది’ అని మరొకరు పేర్కొన్నారు. ‘కృతజ్ఞతకు స్వచ్ఛమైన రూపం. ఇది నిజంగా హృదయ విదారకం’ అని ఒకరు వ్యాఖ్యానించారు.
A final goodbye! In a deeply moving moment from Rayara Doddi in Channapatna near #Bengaluru, an 85-year-old woman who regularly fed monkeys was hugged by one of them after her passing.
(📹: Fwd, to-be cross-checked)@timesofindia pic.twitter.com/zwK3yKA6Iq
— TOI Bengaluru (@TOIBengaluru) April 1, 2026
Also Read:
Kidney Racket | రూ. 50,000 వివాదంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురు డాక్టర్లు అరెస్ట్
Rinku Singh Rahi | పోస్టింగ్ తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. తనను పక్కనపెట్టారంటూ రాజీనామా
Watch: హైకోర్టు ముందు వాహనాలకు నిప్పంటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?